Site icon HashtagU Telugu

Sreeleela: భగవంత్ కేసరి విజయం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది: హీరోయిన్ శ్రీలీల

Sreeleela exclusive dhamaka

Sreeleela

Sreeleela: సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, నందమూరి నటసింహాం బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన ‘భగవంత్ కేసరి’ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.  మొదటిరోజే 30 కోట్లకుపైగా వసూలు చేసి విజయం దిశగా దూసుకెళ్తుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా శ్రీలీల కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ లో దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలైంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ ని నిర్వహించింది. శ్రీలీల మాట్లాడుతూ.. భగవంత్ కేసరి విజయం గొప్ప ఆనందాన్ని ఇచ్చిందని తెలిపింది.

ఈ సినిమాతో నన్ను చూసే విధానం మారిందని.. ఇంత చక్కని పాత్ర ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడికి ధన్యవాదాలు తెలిపింది. బాలకృష్ణ గారి సినిమాలో ఒక అమ్మాయికి ఫైట్ చేసే అవకాశం రావడం మామూలు విషయం కాదని తెలిపింది. విజ్జి పాపకు చిచ్చా వున్నట్లు.. మా సినిమాకి ప్రేక్షకులు వున్నారు. ఇంత మంచి కంటెంట్ ని అంతే గొప్పగా ఆదరిస్తున్నారని శ్రీలీల చెప్పుకొచ్చింది.

అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఈ చిత్రం ప్రమోషన్స్ మొదలుపెట్టినప్పటి నుంచి ఒకే మాట చెప్పాం. ఈ సినిమా శానా యేండ్లు యాదుంటాదని. అది ఈ రోజు నిజం చేశారు. చాలా సంతోషంగా వుందన్నారు. ఒక దర్శకుడిగా ‘భగవంత్ కేసరి’ సంపూర్ణమైన తృప్తిని ఇచ్చిందని అన్నారు. బాలకృష్ణ గారు తన కంఫర్ట్ జోన్ ని దాటి స్త్రీ సాధికారత గురించి వున్న ఈ కథని చేశారు అని ఆయన అన్నారు.

Exit mobile version