Site icon HashtagU Telugu

హీరోగా ఫెయిల్ అయినా.. నటుడిగా మాత్రం ఫెయిల్ అవ్వలేదు

టాలీవుడ్ యంగ్ హీరో రానా అంటే తెలియనివాళ్లు చాలా తక్కువ. బాహుబలిలో భల్లాలదేవగా నటించిన ఆయన ఎక్కడా లేని క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనో, మరోవైపు విలన్ గానూ అదరగొడుతున్నాడు. అప్పుడప్పుడు అరణ్యపర్వం లాంటి విభిన్నమైన సినిమాలు సైతం చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు.  ఓ  హీరోగా రానా ఫెయిల్ అయినా.. ఓ నటుడిగా మాత్రం ఎప్పడూ ఫెయిల్ అవ్వలేదు. ప్రస్తుతం భీమ్లానాయక్ మూవీలో నటిస్తున్న రానా మీడియాతో ముచ్చటించారు.

  1. మొదటిసారి త్రిభాషా చిత్రం అయిన ‘హాతి మేరే సాథి’ మూవీ చేయడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇది పాన్ ఇండియా అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద అంచనాలు అందుకోవడంలో విఫలమైంది.
  2. ఈ మూవీలో భందేవ్ పాత్రను పోషించడం గర్వంగా ఉంది. అడవి, జంతువులను కాపాడాటానికి ఓ వ్యక్తి చేసిన పోరాటం ఆధారంగా ఈ సినిమా తెరక్కెక్కింది. కేరళ, థాయ్‌లాండ్‌లోని దట్టమైన అడవులలో షూటింగ్ చేశాం. వాస్తవానికి గత ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.
  3. భీమ్లా నాయక్ మూవీలో నా పాత్ర చాలా బాగుంటుంది. మొదటిసారి పవన్ తో కలిసి నటించడం కొత్తగా ఉంది. తెలుగు ప్రేక్షకులకు కొత్త సినిమా అవుతుంది. ఈ సినిమా తర్వాత బాబాయ్ వెంకటేశ్ తో కూడా ఓ సినిమా చేయబోతున్నా. తెలుగులో మల్టీస్టారర్ మూవీస్ చేయడానికి నేనూ ఎప్పడైనా రెడీగా ఉంటాను. కొత్త కొత్త కథలు ప్రేక్షకులకు అందిస్తే కచ్చితంగా సినిమాలు చూసేందుకు ఇష్టపడతారు.
  4. స్టార్ అవ్వాలన్నా స్టార్ గా కంటిన్యూ అవ్వాలి కంటెంట్ తో అభిమానులను ఆకట్టుకోవడం చాలా ముఖ్యం అని అంటున్న రానా ప్రస్తుతం డైరెక్టర్లు డిమాండ్ చేసేది అభిమానులు ఆసక్తి చూపించేది కథపై మాత్రమే అంటున్నారు.
  5. నేపోటిజం గురించి మాట్లాడుతూ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఉండాలంటే హార్డ్ వర్క్ ముఖ్యం కానీ ఏ కుటుంబం నుంచి వచ్చాను అనేది అనవసరం.