Sardar 2 : కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ తన సూపర్ హిట్ మూవీ ‘సర్దార్’కి సీక్వెల్ ని సిద్ధం చేస్తున్నారు. పీఎస్ మిత్రన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం.. 2022లో రిలీజయ్యి బిగెస్ట్ హిట్టుగా నిలిచింది. ఆ సినిమా ఎండింగ్ లోనే సీక్వెల్ కి లీడ్ ఇచ్చేలా సన్నివేశాన్ని దర్శకుడు పెట్టడంతో.. ఆడియన్స్ లో సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సీక్వెల్ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆడియన్స్ అంతా ఎదురు చూశారు.
ఇక ఈ యాంటిసిపేటెడ్ సీక్వెల్ షూటింగ్ ని మూడు రోజులు క్రిందటే మొదలుపెట్టారు. సినిమా స్టార్ట్ చేయడంతోనే అదిరిపోయే యాక్షన్ సీన్స్ ని చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ షూటింగ్ లో ఒక ప్రమాదం జరిగి స్టంట్ మెన్ చనిపోయాడు. చెన్నై ప్రసాద్ ల్యాబ్ లో ఈ మూవీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆ షూటింగ్ పాల్గొన్న స్టంట్ మెన్ ‘ఏజ్జ్ మలై’.. దాదాపు ఇరువై అడుగుల ఎత్తు నుంచి కింద పడి మరణించాడు. స్టంట్ మెన్ మరణించడంతో మూవీ టీం షూటింగ్ ని నిలిపివేసింది. అంతేకాదు, ఆ స్టంట్ మెన్ కుటుంబానికి అండగా ఉంటానని కార్తీ తెలియజేసారు.
స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఎస్ జె సూర్య విలన్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. కాగా సర్దార్ 1లో హీరోయిన్ గా రాశిఖన్నా నటించారు. మరి ఈ సీక్వెల్ లో కూడా ఆమెనే తీసుకోబోతున్నారా, లేదా..? అనేది సస్పెన్స్ గా ఉంది. ఎందుకంటే, మూవీ ఓపెనింగ్ లో రాశిఖన్నా కనిపించలేదు. మూవీ టీం కూడా ఇప్పటివరకు ఆమె పేరుని అనౌన్స్ చేయలేదు.