Site icon HashtagU Telugu

HHVM Postponed : వీరమల్లు రిలీజ్ కు బ్రేక్ వేసింది వారేనా..?

Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయాలతో ఎంత బిజీగా ఉన్నా, ఆయన సినిమాలకూ అభిమానుల్లో ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో ఆయన సినిమాల పరిస్థితి ఆశాజనకంగా లేదన్నదే వాస్తవం. ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) వంటి చిత్రాలు లైన్‌లో ఉన్నప్పటికీ, వాటి విడుదల తేదీలు మాత్రం ఇప్పటికీ ఖరారు కావడం లేదు. ముఖ్యంగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌ నిలిచిపోయిందనే వార్తల నడుమ, తాజాగా దర్శకుడు మాత్రం షూటింగ్ కొనసాగుతుందని చెప్పినప్పటికీ స్పష్టతలేని పరిస్థితి నెలకొంది.

GHMC : వాడీవేడిగా కొనసాగుతున్న జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం

ఇక ఎన్నో ఏళ్లుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ, దర్శకులు మారుతూ, షూటింగ్ షెడ్యూల్లు మారుతూ సాగిన ‘హరిహర వీరమల్లు’ సినిమాకు మరోసారి విడుదల వాయిదా పడింది. జూన్ 12న భారీగా విడుదల చేయాలని ప్రచారం చేసినా, అకస్మాత్తుగా సినిమా వాయిదా పడింది. డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రావడంలేదనే అభియోగాలు, ఔట్‌పుట్ సరిగా లేదన్న ప్రచారం, గ్రాఫిక్స్ పనులు ఇంకా పూర్తి కాలేదన్న ఆరోపణలు ఇలా కారణాలెన్నో వినిపిస్తున్నాయి. స్టార్ ఇమేజ్ ఉన్నా, మార్కెట్ డల్‌గా ఉండడం, గత సినిమాల పరాజయాలు, భారీ రేట్లు పెట్టడంతో బయ్యర్ల ఆసక్తి లేకపోవడం అన్నీ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది.

Rishi Sunak: ఆర్సీబీకి బ్రిట‌న్ మాజీ ప్రధాని స‌పోర్ట్.. సోష‌ల్ మీడియాలో ఓ రియాక్ష‌న్ వీడియో వైర‌ల్‌!

ఆ మధ్య ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ సంచలన వ్యాఖ్యలు చేయడం, సినీ పరిశ్రమలోని వ్యక్తులపై ఆరోపణలు చేయడంతో వివాదం ముదిరింది. థియేటర్ బంద్ కుట్ర వెనుక జనసేన నేతే ఉన్నాడంటూ వస్తున్న ఆరోపణలతోపాటు, జనసేన పార్టీ ఆయన్ను సస్పెండ్ చేయడం, దిల్ రాజు పేరు ఎత్తడం – ఇవన్నీ హరిహర వీరమల్లు సినిమాను రాజకీయల వేదికగా మార్చేశాయి. కారణం ఏదైనప్పటికీ సినిమా వాయిదా పడడడం అనేది అభిమానులను తీవ్ర బాధకు గురి చేస్తుంది. మరోపక్క పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు గాను తాను తీసుకున్న రూ.11 కోట్ల రెమ్యూనరేషన్ ను నిర్మాత కు వెనక్కు ఇచ్చేందుకు సిద్దమయ్యాడు.