Site icon HashtagU Telugu

Bollywood : ప్రముఖ హీరోపై రాళ్లతో దాడి..!!

Imaran Hashmi

Imaran Hashmi

బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీపై రాళ్లతో దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ మధ్యే తన సినిమా షూటింగ్ కోసం జమ్మూ కశ్మీర్ వెళ్లారు. అక్కడ పహల్గామ్ లోని ప్రధాన మార్కెట్లో గ్రౌండ్ జీరో సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సమయంలోనే ఇమ్రాన్ హష్మీపై రాళ్లతో దాడి జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇమ్రాన్ హాష్మీపై రాళ్లతో దాడి చేసినట్లుగా ఓ జాతీయ ఛానెల్లో వార్తలు వస్తున్నాయి.

గ్రౌండ్ జీరో సినిమా షూటింగ్ ముగించుకుని తోటినటులు బయటకు వెళ్లిన సమయంలో ఇమ్రాన్ హాష్మీపై దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై పహల్గాం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎందుకు దాడి చేశారన్న విషయంపై స్పష్టత లేదు. కాగా గ్రౌండ్ జీరో మూవీ సరిహద్దు భద్రతా దళం (BSF) జవాన్ ఆధారంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. పహల్గాం కంటే ముందు ఇమ్రాన్ హష్మీ శ్రీనగర్‌లో షూటింగ్‌లో పాల్గొన్నాడు.