Gopi Mohan : రెడీ, ఢీ, దూకుడు.. ఇలా బోలెడన్ని సూపర్ హిట్ సినిమాలకు రచయితగా పనిచేసి స్టార్ రైటర్ గా ఎదిగారు గోపిమోహన్. ముఖ్యంగా డైరెక్టర్ శ్రీను వైట్ల విజయాలలో ముఖ్య పాత్ర పోషించారు. ఇటీవలే చేతన్ ధూం దాం సినిమాకు రచయితగా పనిచేసారు గోపిమోహన్. ముఖ్యంగా కామెడీ రాయడంలో ఈయన దిట్ట. అయితే ఇప్పుడు ఈ స్టార్ రైటర్ దర్శకుడిగా మారుతున్నాడు.
తాజాగా ధూం దాం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గోపి మోహన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం దర్శకుడిగా ఓ సినిమా మొదలుపెట్టబోతున్నాను. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. మహేష్ మేనల్లుడు సిద్దార్థ్ గల్లాతో ఆ సినిమా ఉంటుంది. యూత్ ఫుల్ లవ్ అండ్ కామెడీగా ఆ సినిమా ఉంటుంది అని తెలిపారు.
మహేష్ మేనల్లుడు, గల్లా జయదేవ్ కొడుకు అశోక్ గల్లా హీరోగా పరిచయమై ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు అశోక్ గల్లా తమ్ముడు సిద్దార్థ గల్లా కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆల్రెడీ సిద్దార్థ్ గల్లా హీరోగా ఇటీవలే ఓ సినిమాని మొదలుపెట్టాడు. రెండో సినిమా గోపి మోహన్ దర్శకత్వంలో ఉండనుంది.
Also Read : Samantha : నాకు తల్లి కావాలని ఉంది.. దానికి వయసుతో సంబంధం లేదు.. సమంత కామెంట్స్..