Site icon HashtagU Telugu

Naga Chaitanya : నాగ చైతన్యకు తల్లిగా స్టార్ హీరో వైఫ్..?

Is Naga Chaitanya Engagement with Heroine Today?

Is Naga Chaitanya Engagement with Heroine Today?

Naga Chaitanya అక్కినేని హీరో నాగ చైతన్య ప్రస్తుతం చందు మొండేటి డైరెక్షన్ లో తండేల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ 23న రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమా తర్వాత విరూపాక్ష సినిమా దర్సకుడు కార్తీక్ దండుతో నాగ చైతన్య సినిమా ఉంటుందని తెలుస్తుంది.

విరూపాక్షతో డైరెక్టర్ గా తన సత్తా చాటిన కార్తీక్ మరోసారి అలాంటి థ్రిల్లర్ జానర్ లోనే సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుందని అంటున్నారు. రాధే శ్యాం తర్వాత పూజా హెగ్దే తెలుగులో నటిస్తున్న సినిమా ఇదే. గుంటూరు కారం నుంచి ఆమె ఎగ్జిట్ అవ్వడం అమ్మడికి అవకాశాలు లేకుండా చేశాయి.

ఇదిలాఉంటే ఈ సినిమాలో నాగ చైతన్య మదర్ రోల్ లో కోలీవుడ్ స్టార్ హీరో వైఫ్ నటిస్తుందని తెలుస్తుంది. తమిళంలో స్టార్ హీరో వైఫ్ జ్యోతిక ఒకప్పుడు హీరోయిన్ గా ప్రేక్షకులను మెప్పించారు. సూర్యతో మ్యారేజ్ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న జ్యోతిక మళ్లీ ఈమధ్యనే స్పెషల్ పాత్రల్లో నటిస్తున్నారు. నాగ చైతన్య కార్తీక్ దండు సినిమాలో చైతన్య మదర్ రోల్ లో జ్యోతిక ని తీసుకున్నట్టు తెలుస్తుంది. తెలుగులో జ్యోతిక మాస్, ఠాగూర్ సినిమాల్లో నటించింది.