Site icon HashtagU Telugu

Driver Jamuna: ఐశ్వర్య రాజేష్ ‘డ్రైవర్ జమున’ ఫస్ట్ లుక్

Driver Jamuna

Driver Jamuna

అద్భుతమైన నటనతో విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఐశ్వర్య రాజేష్. విలక్షణమైన పాత్రలలో ఆకట్టుకుంటున్న ఐశ్వర్య రాజేష్ తాజాగా ‘డ్రైవర్ జమున’ పేరుతో మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమౌతున్నారు. ఔట్ అండ్ ఔట్ రోడ్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పా. కిన్స్లిన్ దర్శకత్వం వహిస్తుండగా 18 రీల్స్పై ఎస్.పి.చౌదరి నిర్మిస్తున్నారు. తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు “డ్రైవర్ జమున” ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ముఖం మీద చెమటలు, రక్తం మరకలతో ఫిరోషియస్ గా కనిపించారు ఐశ్వర్య రాజేష్.

లేడీ క్యాబ్ డ్రైవర్ జీవితంలో చోటు చేసుకున్న నాటకీయ సంఘటనల నేపధ్యంలో ‘డ్రైవర్ జమున’ చిత్రాన్ని థ్రిల్లింగ్ గా రూపొందిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్ ఈ పాత్ర కోసం చాలా మంది లేడీ క్యాబ్ డ్రైవర్లని కలసి వారి బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు నేచురల్ గా ఈ పాత్రకు  సిద్ధమైయ్యారు. సాధారణంగా రోడ్ మూవీస్ ని బ్లూ మ్యాట్ టెక్నాలజీని ఉపయోగించి చిత్రీకరిస్తారు. ఐతే ఐశ్వర్య రాజేష్ ప్రతి ఒక్క షాట్ను ఎటువంటి డూప్ ను లేకుండా నటించారు. ఈ చిత్రంలో తన పాత్ర వాస్తవానికి దగ్గరగా వుండే విధంగా స్వయంగా రోడ్లపై కారుని నడిపారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కి గోకుల్ బెనోయ్ సినిమాటోగ్రాఫర్ గా, ఆర్ రామర్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. షూటింగ్ చివరిదశలో వున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు.

తారాగణం: ఐశ్వర్య రాజేష్, ఆడుకలం నరేన్, శ్రీ రంజని, ‘స్టాండ్ అప్ కమెడియన్’ అభిషేక్, పాండియన్, కవితా భారతి, పాండి, మణికందన్, రాజేష్ తదితరులు

Exit mobile version