Pushpa 2 Satellite Rights సెట్స్ మీద ఉండగానే పుష్ప సెకండ్ పార్ట్ కి భారీ డిమాండ్ ఏర్పడింది. సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప 1 నేషనల్ వైడ్ సెన్సేషనల్ హిట్ కాగా ఈ సినిమా సెకండ్ పార్ట్ కోసం ఆడియన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
We’re now on WhatsApp : Click to Join
ఈ క్రమంలో పుష్ప 2 ని ఆడియన్స్ అంచనాలకు తగినట్టుగానే సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. సినిమా నుంచి అప్పట్లో వచ్చిన ఒక టీజర్ భారీ హైప్ తీసుకు రాగా త్వరలో మరో టీజర్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఇక ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే దుమ్ము దులిపేస్తున్నట్టుగా తెలుస్తుంది. పుష్ప 1 బ్లాక్ బస్టర్ అవ్వడంతో పుష్ప 2 ని దక్కించుకోవాలని పోటీ పడుతున్నారు. థియేట్రికల్ డీల్ ఇంకా క్లోజ్ అవ్వలేదు కానీ డిస్నీ హాట్ స్టార్ కి ఓటీటీ రైట్స్ ఇచ్చే ప్లాన్ లో ఉన్నారట. అయితే నెట్ ఫ్లిక్స్ కూడా పుష్ప 2ని దక్కించుకోవాలని భారీ మొత్తం కోట్ చేశారట.
ఇదిలాఉంటే శాటిలైట్ రైట్స్ విషయంలో కూడా పోటీ అలానే ఉంది. సినిమా తెలుగు రైట్స్ మాత్రం స్టార్ మా దక్కించుకుందని తెలుస్తుంది. స్టార్ మా కే పుష్ప 2 రైట్స్ దక్కాయి. ఇందుకు స్టార్ మా బ్లాస్టింగ్ అమౌంట్ వెచ్చించిందని తెలుస్తుంది. పుష్ప 2 ఆగష్టు 15న రిలీజ్ లాక్ చేశారు. అయితే సినిమా ఆ డేట్ కి వస్తుందా రాదా అని ఆడియన్స్ లో డౌట్లు ఉన్నాయి.
Also Read : Raviteja Beautiful Fans : మాస్ రాజా సూపర్ ఫ్యాన్స్ వీళ్లు.. సీనియర్ సిటిజెన్స్ తో రవితేజ..!