Pavala Shyamala : ఒకప్పటి స్టార్ లేడీ కమెడియన్.. ఇప్పుడు తినడానికి కూడా డబ్బులు లేక వృద్దాశ్రమంలో..

పావలా శ్యామల అనేక అవార్డులు అందుకొన్నారు. అనేక సంస్థలు సన్మానాలు చేశాయి. గొప్ప జీవితం చూసిన ఆమె ఇప్పుడు తినడానికి తిండి కూడా లేక, అనారోగ్య సమస్యలతో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Star Lady Comedian Pavala Shyamala now living in a Old age Home and Requesting for Help

Star Lady Comedian Pavala Shyamala now living in a Old age Home and Requesting for Help

పావలా శ్యామల(Pavala Shyamala).. 1984లో బాబాయ్ అబ్బాయ్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించి స్వర్ణ కమలం, కర్తవ్యం, ఇంద్ర, ఖడ్గం, బ్లేడ్ బాబ్జీ, గోలీమార్ వంటి సుమారు 250 సినిమాలలో హాస్య నటిగా, సహాయ నటిగా ప్రేక్షకులని మెప్పించింది. ఖడ్గం, గోలీమార్ సినిమాల్లో పాత్రలు ఇప్పటికి కూడా గుర్తుండిపోయేలా చేసింది పావలా శ్యామల. ఆమె అనేక అవార్డులు అందుకొన్నారు. ఆమె నటనకు అనేక సంస్థలు సన్మానాలు చేశాయి. అంత గొప్ప జీవితం చూసిన ఆమె ఇప్పుడు తినడానికి తిండి కూడా లేక, అనారోగ్య సమస్యలతో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు.

పావలా శ్యామల అందరికీ తన కామెడీతో ఆనందం పంచిపెట్టి ఆమె మాత్రం చాలాకాలంగా దయనీయ జీవితం గడుపుతోంది. నిస్సాహ‌య‌స్థితిలో ఉన్న ఈ సీనియ‌ర్ న‌టి ఆప‌న్నహ‌స్తం అందించాల‌ని ఆర్థిస్తోంది. ఒకవైపు ఆర్ధిక భారం.. మరో వైపు వయోభారం ఆమెకు నరకం చూపిస్తున్నాయి. అంతేకాక ఎదిగిన కూతురు కూడా మంచానికి పరిమితమవ్వడంతో పావలా శ్యామల తీవ్ర మనోవేదనకు గురవుతుంది.

గతంలో ఆమెకు కొంత మంది సహాయం అందించినా అవి తాత్కాలిక ఉపశమనం మాత్రమే కల్గించింది. ఇటీవల తనకు వచ్చిన అవార్డులను అమ్ముకొని ఆ డబ్బుతో బియ్యం, పప్పులు కొనుక్కున్నాను అని, అనారోగ్యంతో ఉన్న తాము తినడానికి తిండి లేక పస్తులుండాల్సి వస్తుందని, వృద్దాశ్రమంలో డబ్బులు కడదామన్న లేవు అని ఆవేదన వ్యక్తం చేసింది. పలువురు సినీ వ్యక్తులు ఆమెని కలవగా ఈ విషయాన్ని తెలిపి బాధపడింది. పరిస్థితులు ఇలాగే ఉంటే ఏదో ఓ రోజు ఇద్దరం మంచంలోనే ఆకలితో చనిపోతామని, ఆత్మహత్య చేసుకోవడానికి ధైర్యం సరిపోవడం లేదు అని చెప్పి విలపించింది.

దీంతో పలువురు సినీ వ్యక్తులు ఆమె అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని ఎవరైనా సాయం చేయాలనుకుంటే ఆమె అకౌంట్ కి డబ్బులు పంపించమని లేదా ఆమె నివసించే వృద్దాశ్రమంకు వెళ్లి డైరెక్ట్ గా ఏమన్నా ఇవ్వొచ్చు అని తెలిపారు. అందుకు 9849175713 నంబర్ ని సంప్రదించాలని, డబ్బులు సహాయం చేసేవారు Neti Shyamala , A/c: 52012871059, IFSC :SBIN0020458, Srikrishna Nagar , Yusufguda Branch, Hyderabad కి పంపగలరని తెలిపారు.

 

Also Read : Allu Arjun : నేషనల్ అవార్డు అందుకొని వస్తున్న బన్నీ.. ఇంటి వద్ద అభిమానుల సందడి..

  Last Updated: 18 Oct 2023, 06:09 PM IST