Star Heroine: ముంబైలో తన డ్యూప్లెక్స్ అమ్ముకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే?

బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ అంటే కుర్రకారుకు చాలా ఇష్టం. గత కొద్ది రోజులుగా ఆమె సినిమాలు అడపాదడపా చేస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
Scoop Sonam Kapoor Ahuja Starrer Blind To Release Directly On Zee5 After Deal With Netflix Failed To Materialize 1

Scoop Sonam Kapoor Ahuja Starrer Blind To Release Directly On Zee5 After Deal With Netflix Failed To Materialize 1

Star Heroine: బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ అంటే కుర్రకారుకు చాలా ఇష్టం. గత కొద్ది రోజులుగా ఆమె సినిమాలు అడపాదడపా చేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ భారత్‌లో కంటే ఎక్కువగా లండన్‌లో ఉంటారు. తన భర్త ఆనంద్ అహుజా, కొడుకు వాయుతో కలిసి ఆమె అక్కడే నివశిస్తున్నారు. అందువల్ల ముంబయిలో ఉన్నటువంటి తన లగ్జరీ అపార్ట్మెంట్ ను ఈ హీరోయిన్ అమ్మేసింది. ముంబయి బాంద్రా కుర్లా కాంప్లెక్సులో ఉన్న ఆ ఇల్లును భారీ ధరకు అమ్మినట్లు సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి.

సిగ్నేచర్ ఐలాండ్‌లో ఉన్న థర్డ్ ఫ్లోర్ హౌస్‌ను సోనమ్ కపూర్ రూ.32.5 కోట్ల భారీ ధరకు అమ్మేసినట్లు సమాచారం. 2015లో ఈ ఇల్లును ఆమె కొనుగోలు చేశారు. తాజాగా ఆ ఇంటిని ఆమె అమ్మేశారు. 5,533 చదరపు అడుగుల వైశాల్యం ఉన్నటువంటి ఆ ఇంటిని అప్పట్లో రూ.16 నుంచి రూ.17 కోట్లకు సోనమ్ కపూర్ కొనుగోలు చేసినట్లు స్క్వేర్ ఫీట్ ఇండియా వెల్లడించింది. రూ.16 కోట్లకు కొని దాదాపు అంతకంటే రెట్టింపు ధరకు విక్రయించిన సోనమ్ కపూర్ మంచి లాభాన్నే అందుకున్నట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.

సోనమ్ కపూర్ ప్రస్తుతం లండన్‌లో తన కుటుంబంతో కలిసి ఉంటున్నారు. గతేడాది ఆగస్టులో వాయు అనే పండంటి మగబిడ్డకు ఈమె జన్మనివ్వగా అప్పటి నుంచి ఆమె లండన్ లోనే భర్త వద్ద ఉంటున్నారు. బిడ్డ పుట్టిన విషయాన్ని కూడా ఆమె భర్త ఆనంద్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

సోనమ్ కపూర్ ఆఖరుగా 2019లో వచ్చిన జోయా ఫ్యాక్టర్ అనే సినిమాలో కనిపించారు. ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అనుకున్న స్థాయిలో ఆ సినిమా ఆకట్టుకోలేకపోయింది. అప్పటి నుంచి ఆమె సినిమాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. తన బిడ్డను, భర్తను చూసుకుంటూ ఈమె వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు.

  Last Updated: 04 Jan 2023, 07:18 PM IST