హను రాఘవపుడి (Hanu Raghavapudi) డైరెక్షన్ లో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా సీతారామం (Sitharamam Movie) . ఈ సినిమాను వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. సినిమా ప్రేక్షకులను అలరించడంలో సూపర్ సక్సెస్ అయ్యిని. సీతారామం సినిమాతో మృణాల్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఐతే ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు మృణాల్ (Mrunal Thakur) ని అనుకోలేదట. అప్పుడు సూపర్ ఫాం లో ఉన్న బుట్ట బొమ్మ పూజా హెగ్దేని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారట.
కానీ పూజా హెగ్దే వేరే ప్రాజెక్ట్ తో బిజీగా ఉండటం.. ఇంకా ఈ సినిమాలో నటించడానికి అంతగా ఆసక్తి చూపించకపోవడం వల్లే ఛాన్స్ మిస్ చేసుకుందని తెలుస్తుంది. సీతారామం సినిమాలో సీతామహాలక్ష్మి పాత్రలో మృణాల్ తన అభినయంతో మెప్పించింది. ఒకవేళ పూజా హెగ్దే (Pooja Hegde) చేసినా ఆ పాత్రకు అంత క్రేజ్ వచ్చే అవకాశం ఉండేది కాదని చెప్పొచ్చు.
పూజా మిస్ చేసుకున్న ఛాన్స్ వాడుకున్న మృణాల్ ఠాకూర్ తెలుగులో సూపర్ హిట్ అందుకుంది. అంతేకాదు అమ్మడు ఆ సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకుని వరుస ఛాన్సులు అందుకుంటుంది. పూజా హెగ్దే మాత్రం సీతారామం మిస్ చేసుకుని వరుస ఫ్లాప్ సినిమాలు చేసింది. దాని వల్ల అమ్మడికి తెలుగులో పెద్దగా అవకాశాలు లేకుండా పోయాయి. సీతారామం సినిమా విషయంలో పూజా హెగ్దే అన్ లక్కీ కాగా మృణాల్ ఠాకూర్ వెరీ లక్కీ అని చెప్పొచ్చు.
ఒకవేళ పూజా హెగ్దే సీతారామం సినిమా చేసుండి ఆ సినిమా సూపర్ హిట్ అయితే మాత్రం ఇప్పుడు టాలీవుడ్ లో ఆమె ఇంకా తన ఫాం కొనసాగించేది. కానీ ఆ సినిమా మిస్ చేసుకుని మిస్టేక్ చేసింది అమ్మడు. గుంటూరు కారం లో చేస్తూ మధ్యలో ఎగ్జిట్ అయిన పూజా హెగ్దే మరో ఛాన్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. కానీ మన మేకర్స్ మాత్రం ఆమె వైపు చూడట్లేదు.