Lunch Party for Bigg Boss Contestents బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి పండుగ సందర్భంగా స్టార్ హీరో విందు భోజనం ఏర్పాటు చేశారు. షో పూర్తి కాగా పండుగ కూడా రావడంతో కంటెస్టెసంట్స్ అందరికీ రకరకాల వంటలతో పండుగ నాడు మంచి విందు ఏర్పాటు చేశారట. అదేంటి తెలుగు బిగ్ బాస్ పూర్తై చాలా రోజులు అవుతుందిగా మళ్లీ ఇప్పుడు వాళ్లందరినీ పిలిచి హోస్ట్ నాగార్జున భోజనం పెట్టారా అని అనుకోవచ్చు. ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది మన స్టార్ కాదు తమిళ స్టార్ కమల్ హాసన్. ఆయన కూడా తమిళ బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే.
We’re now on WhatsApp : Click to Join
రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 7 పూర్తైంది. అక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన వీజే అర్చన టైటిల్ విన్నర్ అయ్యింది. ఇక జనవరి 14న షో పూర్తి కాగా షో పూర్తైన వెంటనే ఫైనల్ ఎపిసోడ్ తర్వాత కంటెస్టెంట్స్ అందరికీ కమల్ హాసన్ (Kamal Hassan) విందు భోజనం ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. మొదటి వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ నుంచి చివరి వారకు హౌస్ నుంచి వెళ్లిన వారంతా ఫైనల్ ఎపిసోడ్ కి వస్తారని తెలిసిందే. వారందరికీ కమల్ హాసన్ మంచి విందుని ఏర్పాటు చేశారట.
ఇక్కడ నాగార్జున (Nagarjuna) ఎలా బుల్లితెర ఆడియన్స్ ని అలరిస్తుంటారో అక్కడ కమల్ హాసన్ కూడా హోస్ట్ గా అదరగొట్టేస్తున్నారు. ఇక్కడైనా సరే సీజన్ 1 ఎన్.టి.ఆర్, సీజన్ 2 నాని హోస్ట్ గా చేశారు కానీ కమల్ హాసన్ మొదటి సీజన్ నుంచి తమిళ బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తూ వచ్చారు. మధ్యలో హోస్ట్ మారుతాడని వార్తలు వచ్చినా కూడా మళ్లీ ఆయన్నే ఒప్పించి హోస్ట్ గా కొనసాగిస్తున్నారు. బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తున్నందుకు కమల్ హాసన్ కి భారీ రెమ్యునరేషన్ అందిస్తున్నారని తెలుస్తుంది.
తెలుగులో నాగార్జున కూడా హోస్ట్ గా భారీ పారితోషికం తీసుకుంటుండగా కోలీవుడ్ లో కమల్ కూడా దూసుకెళ్తున్నారు. ప్రతి సీజన్ లో కంటెస్టెంట్స్ ని తమ సొంత ఇంటి సభ్యులుగా హోస్ట్ నాగార్జున, కమల్ హాసన్ ఇద్దరు భావిస్తారు. ఈ క్రమంలో ఏదైనా పండుగ వస్తే మాత్రం కంటెస్టెంట్స్ ని కూడా వారి ఇంటి సభ్యులుగా భావించి వారికి కానుకలు ఇస్తుంటారు.
Also Read : Mahesh Babu : మహేష్ లో ఈ టాలెంట్ కూడానా.. బాబోయ్ బాబు మామూలోడు కాదండోయ్..!
బిగ్ బాస్ తెలుగు హోస్ట్ గా నాగార్జున సూపర్ హిట్ అయితే.. తమిళంలో కమల్ హాసన్ సూపర్ హిట్ అయ్యారు. ఓ పక్క కమల్ సినిమాలతో కూడా దూసుకెళ్తున్నారు. విక్రం తర్వాత సూపర్ ఫాంలోకి వచ్చిన కమల్ ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. కమల్ తిరిగి ఫాం లోకి రావడం లోకనాయకుడి ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేస్తుంది.