Jai Hanuman Prashanth Varma Next Level Plan : జై హనుమాన్ కోసం నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్.. ఆంజనేయుడిగా నటించే స్టార్ హీరో ఎవరు..!

Jai Hanuman Prashanth Varma Next Level Plan ప్రశాంత్ వర్మ తేజా సజ్జ కలిసి చేసిన హనుమాన్ సినిమా సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా చివర్లో

Published By: HashtagU Telugu Desk
Director Prashanth Varma Sensational Tweet on Negitive Posts about Hanuman and his Team

Director Prashanth Varma Sensational Tweet on Negitive Posts about Hanuman and his Team

Jai Hanuman Prashanth Varma Next Level Plan ప్రశాంత్ వర్మ తేజా సజ్జ కలిసి చేసిన హనుమాన్ సినిమా సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా చివర్లో జై హనుమాన్ అంటూ సీక్వెల్ ప్రకటించారు. తేజా సజ్జ హనుమంతు రోల్ లో నటించగా రాబోతున్న సీక్వెల్ లో ఆంజనేయుడు ఉంటాడని తెలుస్తుంది. ఇక జై హనుమాన్ కి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. హనుమాన్ సెకండ్ పార్ట్ జై హనుమాన్ లో తేజా సజ్జ ఉండడని అన్నారు. అంతేకాదు జై హనుమాన్ లో స్టార్ హీరో నటిస్తారని చెప్పారు.

We’re now on WhatsApp : Click to Join

హనుమాన్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో జై హనుమాన్ పై సూపర్ క్రేజ్ ఏర్పడింది. అయితే ప్రశాంత్ వర్మ చెప్పిన ఆ స్టార్ హీరో ఎవరన్నది తెలియాల్సి ఉంది. జై హనుమాన్ సినిమాలో ఆంజనేయుడిగా నటించే ఆ స్టార్ హీరో ఎవరన్నది క్లారిటీ రావాల్సి ఉంది. అయితే కొందరు చరణ్ ఆంజనేయుడిగా నటిస్తాడని అంటుండగా మరికొందరు అర్జున్ సర్జా హనుమంతుడిగా చేస్తాడని అంటున్నారు.

జై హనుమాన్ సినిమా 2025 లో రిలీజ్ చేస్తామని మరోసారి క్లారిటీ ఇచ్చారు ప్రశాంత్ వర్మ. అంతేకాదు ఈ సినిమాతో పాటుగా ఈ ఇయర్ అధీర, మహాకాళీ రెండు సినిమాలు రిలీజ్ చేస్తామని అన్నారు. ప్రశాంత్ వర్మ అనౌన్స్ మెంట్ తో హనుమాన్ ఫ్యాన్స్ అంతా సూపర్ ఎగ్జైట్ అవుతున్నారు.

Also Read : NTR Devara : దేవర రిలీజ్ పై ఫ్యాన్స్ లో కన్ ఫ్యూజన్.. ఆ కారణాలతో వాయిదా వేస్తారా..?

  Last Updated: 22 Jan 2024, 09:06 PM IST