Star Hero Invest 6 Crores : స్టార్ హీరోయిన్ తో ప్రేమ.. 2 నెలల్లో 6 కోట్లు ఖర్చు చేసిన స్టార్..!

Star Hero Invest 6 Crores ఆన్ స్క్రీన్ అలరించిన జంటలు కొన్ని ఆఫ్ స్క్రీన్ లో కూడా వారి రిలేషన్ షిప్ ను కొనసాగిస్తారు. సినిమా చేస్తున్న టైం లో హీరో హీరోయిన్ మధ్య క్లోజ్ నెస్ పెరగడం

Published By: HashtagU Telugu Desk
Star Hero Costed 6 Crores In 2 Months For Heroine Love

Star Hero Costed 6 Crores In 2 Months For Heroine Love

Star Hero Invest 6 Crores ఆన్ స్క్రీన్ అలరించిన జంటలు కొన్ని ఆఫ్ స్క్రీన్ లో కూడా వారి రిలేషన్ షిప్ ను కొనసాగిస్తారు. సినిమా చేస్తున్న టైం లో హీరో హీరోయిన్ మధ్య క్లోజ్ నెస్ పెరగడం దాని వల్ల ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి ప్రేమలో పడటం కామనే. అయితే ఇలా ప్రేమించిన ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకుంటారా అంటే లేదనే చెప్పొచ్చు. కొందరు తమ రిలేషన్ షిప్ ని నెక్స్ట్ స్టేజ్ కి తీసుకెళ్తే కొందరు మాత్రం కొన్నాళ్లు కలిసి తిరిగి తర్వాత ఎవరి దారి వారు చూసుకుంటారు.

ఇలాంటివి కామన్ గానే జరుగుతుంటాయి. అయితే కోలీవుడ్లో కూడా స్టార్ హీరోయిన్ తో లవ్ స్టోరీ నడిపించిన ఒక హీరో ఆమె కోసం దాదాపు 6 కోట్లు ఖర్చు చేశాడట. అయినా కూడా వారి ప్రేమ నిలబడలేదు. ఆ హీరోని కాదని బిజినెస్ మ్యాన్ తో ఆ హీరోయిన్ పెళ్లైంది. ఇంతకీ ఎవరా హీరోయిన్.. ఎవరా స్టార్ హీరో అంటే.. హాన్సిక మోత్వాని, శింబు అని తెలుస్తుంది.

కోలీవుడ్ లో మంచి ఇమేజ్ ఉన్న శింబు సినిమాలతో సత్తా చాటుతూ వస్తున్నా ఆఫ్ స్క్రీన్ లవ్ స్టోరీస్ తో కూడా వార్తల్లో నిలిచాడు. నయనతారతో శింబు ప్రేమాయణం గురించి తెలిసిందే. అది ముగిశాక మరో స్టార్ హీరోయిన్ హాన్సికతో లవ్ స్టోరీ నడిపించాడు శింబు. ఇద్దరు కలిసి ఒక సినిమాలో నటించగా ఇద్దరు క్లోజ్ అయ్యారు. హాన్సికతో ప్రేమలో ఉన్న టైం లో శింబు ఆమె కోసం భారీగా డబ్బు ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది.

కేవలం 2 నెలల్లోనే హాన్సిక కోసం 6 కోట్ల దాకా ఖర్చు చేశాడట. అయితే ఇంత ఖర్చు పెట్టినా హాన్సిక సోహైల్ కతురియాని పెళ్లాడింది. శింబుతో లవ్ స్టోరీ కి ఎండ్ కార్డ్ వేసిన హాన్సిక కోలీవుడ్ లో కెరీర్ దాదాపు ముగిసింది అనుకున్న టైం లో తన స్నేహితుడిని పెళ్లాడింది. అయితే శింబు మాత్రం ఇప్పటికీ బ్యాచిలర్ గానే ఉన్నాడు.

Also Read : SRH Captain Cummins Pushpa Dailogue : SRH అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్.. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ ట్రీట్..!

  Last Updated: 24 Apr 2024, 07:06 PM IST