Site icon HashtagU Telugu

Trivikram Aravinda Method: మహేశ్ మూవీలో ‘అరవింద సమేత’ ఫార్ములా!

Mahesh

Mahesh

మహేశ్, త్రివిక్రమ్ ది హిట్ కాంబినేషన్.. చాలా ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. మహేష్ – త్రివిక్రమ్ ల సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫైట్ సీక్వెన్స్ తో ప్రారంభం కానుంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్‌ను వేస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ బిజీగా ఉన్నారు. ‘కేజీఎఫ్’ స్టంట్ మాస్టర్స్ అన్బరీవ్ ఫైట్స్ కంపోజ్ చేయనున్నారు. ఎన్టీఆర్ “అరవింద సమేత”కి కూడా త్రివిక్రమ్ అదే పద్ధతిని అనుసరించాడు. మొదటి రోజు, మొదటి షెడ్యూల్‌లో కీలకమైన పోరాట సన్నివేశాలను చిత్రీకరించాడు.

ఇప్పుడు మహేష్ బాబు సినిమాకి కూడా అదే  సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు. యాక్షన్ స్టంట్స్ చేయడానికి మహేశ్ ఇప్పటికే బాడీని బాగా పెంచాడు. ప్రధాన ఫైట్ సీక్వెన్స్‌ను ముగించిన తర్వాత, టీమ్ కామెడీ భాగాలపై దృష్టి పెడుతుంది. సెప్టెంబర్ మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. రాధా కృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. #SSMB28 యాక్షన్ ఎక్స్‌ట్రావాగాంజాగా ఉండబోతోంది. ఈ చిత్రం ఏప్రిల్ 2023లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version