పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సుజీత్ (Pawan Kalyan – Sujeeth) కలయికలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘దె కాల్ హిమ్ ఓజి’ (OG). ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపిస్తుండగా ఆయనకు జోడిగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై RRR నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు. ఆయనతో పాటు శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, హరీష్ ఉత్తమన్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్ సినిమాపై అంచనాలు పెంచాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. కాగా ఈ సినిమా కోసం బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య(Ganesh Acharya)తో ఉన్న ఫోటో ను ‘ఓజి’ టీంకు సంబంధించిన వ్యక్తి పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ మూవీలో నేహా శెట్టి ఓ స్పెషల్ సాంగ్ చేయబోతుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ స్పెషల్ సాంగ్ కోసం గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ వహించారని తెలుస్తోంది. నేహా శెట్టి ‘డీజే టిల్లు’ మూవీతో మంచి పాపులారిటీని దక్కించుకుంది. ముఖ్యంగా యూత్ లో అమ్మడికి ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఆమె ఈ సినిమాలో పలు కీలక సన్నివేశాలతో పాటు ప్రత్యేక సాంగ్ కూడా చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం గణేష్ ఆచార్య వరుసగా టాలీవుడ్ పెద్ద సినిమాలకు కొరియోగ్రఫీ అందిస్తున్నాడు. దేవర , పుష్ప 2 వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు అద్భుతమైన కొరియోగ్రఫీ ఇచ్చాడు. ఇప్పుడు పవన్ కోసం రంగంలోకి దిగుతున్నాడు.
Read Also : Discovery Lookback 2024 : 2024లో గ్రహాంతర జీవుల కోసం చేపట్టిన అంతరిక్ష ప్రయోగాలు..!