Anchor : డిప్రెషన్లోకి స్టార్ యాంకర్..కారణం వారేనట!

Anchor : సోషల్ మీడియా ట్రోలింగ్‌ను తట్టుకుని, తన కెరీర్‌లో ముందుకు సాగాలనే ఉద్దేశంతో త్వరలోనే టీవీల్లో కనిపించబోతున్నట్లు తెలిపారు

Published By: HashtagU Telugu Desk
Anchor Shilpa Chakravarthy

Anchor Shilpa Chakravarthy

బుల్లితెరపై తనదైన శైలిలో సందడి చేసిన ప్రముఖ యాంకర్ శిల్పా చక్రవర్తి (Anchor Shilpa Chakravarthy) ఇటీవల తన ఆవేదనను వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న నెగటివ్ కామెంట్లు, బూతు మెస్సేజ్‌లు కారణంగా తీవ్ర మనస్తాపానికి గురయ్యానని ఆమె ఓ వీడియో ద్వారా వెల్లడించారు. తాను ఏదైనా వీడియో పోస్ట్ చేసినా, కొన్ని బ్యాడ్ కామెంట్లు రావడం వల్ల ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చిందని, బయటకు వెళ్లేందుకు కూడా భయపడే పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చారు.

Dreams: మీకు ఈ స‌మ‌యంలో క‌ల‌లు వ‌స్తున్నాయా?

తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నట్లు శిల్పా వెల్లడించారు. కరోనా కాలంలో తన భర్త వ్యాపారం పూర్తిగా ఆగిపోయిందని, దీంతో కుటుంబ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడిందని తెలిపారు. ఇదే సమయంలో తన తల్లిదండ్రులు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, పైగా బంధువులు కూడా సహకరించకుండా, వ్యంగ్య వ్యాఖ్యలతో మరింత ఇబ్బంది పెట్టారని వెల్లడించారు. ఈ పరిస్థితుల వల్లనే తాను కొంతకాలం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.

Faria Abdullah: Where Fashion Meets Identity

అయితే ఈ కష్టాలను దాటి తిరిగి బుల్లితెరపై కనిపించనున్నట్లు శిల్పా చక్రవర్తి స్పష్టం చేశారు. ప్రేక్షకుల ప్రేమ, ఆదరణ తనకు ఎప్పుడూ తోడుగా ఉంటుందని విశ్వాసంతో, మళ్లీ తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లాలని సంకల్పించుకున్నట్లు తెలియజేశారు. సోషల్ మీడియా ట్రోలింగ్‌ను తట్టుకుని, తన కెరీర్‌లో ముందుకు సాగాలనే ఉద్దేశంతో త్వరలోనే టీవీల్లో కనిపించబోతున్నట్లు తెలిపారు. ఆమె పోరాటం, ధైర్యం చాలామందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

  Last Updated: 17 Mar 2025, 06:33 PM IST