Site icon HashtagU Telugu

Rajamouli: ప్రేమలు మూవీపై ప్రశంసలు కురిపించిన రాజమౌళి.. కొంచం బాధతో ఆ మాట ఒప్పుకోవాలి!

Mixcollage 13 Mar 2024 12 39 Pm 4041

Mixcollage 13 Mar 2024 12 39 Pm 4041

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా ఎక్కువగా వినిపిస్తున్న పేరు ప్రేమలు. తమిళ సినిమా అయినా ఈ సినిమాను దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కొడుకు కార్తికేయ తెలుగులోకి విడుదల చేశారు. ఈ సినిమా తెలుగులోకి విడుదల అయ్యి మంచి సక్సెస్ సాధించడంతో పాటు అందరి చేత శభాష్ అనిపించుకుంది. మహేష్ బాబు, రాజమౌళి లాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం ఈ సినిమాను మెచ్చుకోలేక ఉండలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్న రాజమౌళి ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. సాధారణంగా నేను ప్రేమకథలు, రొమాంటిక్‌ కామెడీ చిత్రాలను ఇష్టపడను. నాదంతా యాక్షన్, ఫైట్స్‌ స్టైల్‌. మలయాళ ప్రేమలు సినిమా బాగుంది.. తెలుగులో రిలీజ్‌ చేస్తున్నానంటూ మా అబ్బాయి కార్తికేయ చెప్పడంతో ఏదో ఉత్సాహపడుతున్నాడులే అనుకున్నాను. సినిమాకి వెళ్లాక తొలి పదిహేను నిమిషాల తర్వాతి నుంచి చివరి వరకూ నవ్వుతూనే ఉన్నాను అని తెలిపారు రాజమౌళి. మలయాళంలో హిట్‌గా నిలిచిన ఈ మూవీని ఎస్‌ఎస్‌ కార్తికేయ ఈ నెల 8న తెలుగులో విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంగళవారం సక్సెస్‌మీట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్‌ఎస్‌ రాజమౌళి ప్రేమలు మూవీకి డైలాగులను అద్భుతంగా రాశాడు ఆదిత్య. కొంచెం అసూయ, కొంచెం బాధతో ఈ మాటను ఒప్పుకోవాలి. మలయాళ నటీనటులందరూ చాలా బాగా యాక్ట్‌ చేస్తారు. ప్రేమలులోని నటీనటులు అద్భుతంగా నటించారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న సంగీతదర్శకుడు ఎంఎం కీరవాణి, దర్శకులు అనిల్‌ రావిపూడి, అనుదీప్‌ కూడా మాట్లాడారు.

Exit mobile version