SSMB29: టాలీవుడ్ మాస్టర్ స్టోరీటెల్లర్ రాజమౌళి నుంచి వచ్చే ప్రతి సినిమా పట్ల దేశవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకుతుంటాయి. ‘బాహుబలి’తో గ్లోబల్ లెవెల్‌లో గుర్తింపు తెచ్చుకున్న ఆయన ‘ఆర్‌ఆర్‌ఆర్’తో మరింత పెద్ద మైలురాయిని సాధించారు. అందుకే ఇప్పుడు ఆయన దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా వస్తున్న ‘ఎస్ఎస్ఎంబీ29’ ప్రాజెక్ట్ పట్ల ఫ్యాన్స్‌కి ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ ప్రాజెక్ట్ మీద ఎలాంటి అధికారిక అప్డేట్ ఇవ్వకపోవడం, షూటింగ్ మొదలైందా లేదా అనే క్లారిటీ లేకపోవడం ఫ్యాన్స్‌లో ఆగ్రహం, నిరాశ కలిగిస్తోంది.
ఇటీవల ఇండియా టెస్ట్ క్రికెట్ మ్యాచ్ గెలిచిన సందర్భంగా టీమ్ ఇండియాను పొగుడుతూ రాజమౌళి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కానీ ఆ పోస్ట్ కింద అభిమానులు వేసిన కామెంట్స్ ఒక్కటే – “వేర్ ఈజ్ ఎస్ఎస్ఎంబీ29 అప్డేట్?” క్రికెట్ చూడటానికి, స్పెషల్ ఈవెంట్స్‌కి హాజరవ్వడానికి, కుటుంబ వేడుకల్లో పాల్గొనడానికి సమయం ఉంటే సినిమా అప్డేట్‌కి ఎందుకు సమయం ఉండదంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
‘బాహుబలి’ స్థాయి ఎపిక్ చేస్తానని చెప్పిన దర్శకధీరుడు, ఇప్పుడు మహేశ్ బాబు సినిమా గురించి ఒక్క అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వకపోవడం ఫ్యాన్స్‌ను మరింత అసహనానికి గురి చేస్తోంది. మరికొందరైతే సోషల్ మీడియాలోనే రాజమౌళితో గొడవపడినట్లుగా కామెంట్స్ పెడుతున్నారు.
CM Chandrababu : కొనసాగుతున్న ఏపీ మంత్రివర్గ సమావేశం.. 10 కీలక అంశాలపై చర్చ..!
సాధారణంగా స్టార్ హీరోల సినిమాలపై బర్త్‌డే స్పెషల్ పోస్టర్స్, గ్లింప్స్ లేదా టీజర్స్ విడుదల చేయడం టాలీవుడ్‌లో ట్రెండ్‌గా మారింది. ఈసారి మహేశ్ బాబు బర్త్‌డే (ఆగస్టు 9) సందర్భంగా అయినా ‘ఎస్ఎస్ఎంబీ29’పై ఒక క్లారిటీ వస్తుందేమోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ రాజమౌళి వైపు నుంచి అలాంటి ఏ సూచనలూ లేవు. దీనివల్ల ఫ్యాన్స్‌లో ఆత్రం మరింత పెరిగింది.
“మా హీరో బర్త్‌డే వస్తుంది. కనీసం అప్పటికైనా ఒక అప్డేట్ ఇవ్వండి” అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ విపరీతంగా ట్రెండ్స్ చేస్తున్నారు. ఇప్పటికే ‘మాస్స్ అప్‌డేట్ ఫర్ ఎస్ఎస్ఎంబీ29’ అంటూ హ్యాష్‌ట్యాగ్స్ తో ట్రెండింగ్ మొదలైంది. “బడ్జెట్, స్టోరీ గురించి విన్నా ఫుల్ సాటిస్ఫై అయ్యాం. కానీ షూటింగ్ ఎక్కడ? అప్డేట్ ఎక్కడ?” అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
రాజమౌళి సినిమాలకే ఫ్యాన్స్ ఎదురుచూపులు సహజమైపోయాయి. ఆయన తానే ఇస్తానన్నప్పుడే అప్డేట్ వస్తుంది. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ సమయంలో కూడా ఇదే పద్ధతి పాటించారు. అయితే ఈసారి మహేశ్ బాబు సినిమాపై అంచనాలు చాలా ఎక్కువ. అందుకే అభిమానులు ఈ నిరీక్షణను తట్టుకోలేకపోతున్నారు.
ప్రస్తుతం రాజమౌళి ఈ ప్రాజెక్ట్ పక్కనపెట్టి ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారనే అభిప్రాయం ఫ్యాన్స్‌లో పెరుగుతోంది. కానీ ఆయన నిజంగా ఏమి చేస్తున్నారో మాత్రం స్పష్టంగా ఎవరికీ తెలియదు.
‘ఎస్ఎస్ఎంబీ29’పై ఒక చిన్న అప్డేట్ కూడా విడుదలైతే ఫ్యాన్స్ ఆవేశం చల్లారే అవకాశం ఉంది. లేకపోతే ఈ నిరీక్షణ మరింత కోపం, నిరాశలకు దారి తీసే అవకాశముంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూసినప్పుడు “మహేశ్ సినిమాను పక్కన పెట్టినట్టేనా రాజమౌళి?” అనే ప్రశ్న మూవీ లవర్స్ మదిలో గట్టిగా వినిపిస్తోంది.
Rahul Gandhi : భారత్‌పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు.. మోడీ మౌనం అందుకేనా?: రాహుల్ గాంధీ ఎద్దేవా