Site icon HashtagU Telugu

Priyanka Chopra: ఎస్ఎస్ఎంబీ 29.. ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ విడుదల!

Priyanka Chopra

Priyanka Chopra

Priyanka Chopra: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ప్రతిష్టాత్మక పాన్-వరల్డ్ చిత్రం (తాత్కాలికంగా ‘గ్లోబ్‌ట్రాటర్’ లేదా ‘SSMB 29’ గా పిలుస్తున్నారు) నుండి తొలి ప్రధాన పాత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) పోషిస్తున్న ‘మందాకిని’ పాత్ర లుక్‌ను బుధవారం సాయంత్రం మేకర్స్ విడుదల చేయడంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది.

రాజమౌళి ట్వీట్‌

ఈ పోస్టర్‌ను తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్న దర్శకుడు రాజమౌళి.. ప్రియాంక చోప్రాను అభినందిస్తూ ఆసక్తికరమైన కామెంట్ చేశారు. “ప్రపంచ వేదికపై భారతీయ సినిమాను పునర్నిర్వచించిన మహిళ. దేశీ గర్ల్‌కు తిరిగి స్వాగతం! మందాకిని అనేక షేడ్స్‌ను ప్రపంచం వీక్షించడానికి వేచి ఉండలేకపోతున్నాను” అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు.

Also Read: IPL 2026 Retention: ఐపీఎల్ 2026 రిటెన్షన్ లిస్ట్.. ఏ రోజు, ఎక్కడ లైవ్ చూడాలి?

ప్రియాంక చోప్రా సైతం తన పాత్రను వర్ణిస్తూ.. “ఆమె కంటికి కనిపించే దానికంటే ఎక్కువే… మందాకినిని పలకరించండి” అని పోస్టర్‌ను పంచుకున్నారు. మహేష్ బాబు కూడా ఈ లుక్‌ను షేర్ చేస్తూ “ఇప్పుడు ఆమె వచ్చింది… మందాకినిని కలవండి” అని తెలిపారు.

క్లిఫ్ ఎడ్జ్‌లో చీర కట్టి గన్ ఫైర్!

ప్రియాంక ఫస్ట్ లుక్ కమర్షియల్ సినిమాల్లోని సాధారణ హీరోయిన్ పాత్రలకు పూర్తి భిన్నంగా ఉంది. ఫస్ట్ లుక్‌లో ఆమె ప్రకాశవంతమైన పసుపు రంగు చీర ధరించి, ఒక కొండ అంచున ఉంది. అక్కడ ఆమె తన సమతుల్యతను కాపాడుకుంటూ గురి తప్పని తుపాకీతో కాల్పులు జరుపుతున్న పవర్-ప్యాక్డ్ యాక్షన్ సీన్‌లో కనిపించింది. ఈ స్టీరియోటైప్ లేని లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రియాంక యాక్షన్ అవతార్‌ను చూసిన అభిమానులు సోషల్ మీడియాలో ‘బాక్స్ ఆఫీస్ సునామీ’, ‘దేశీ పవర్’ అంటూ కామెంట్లు, ఫైర్ ఎమోజీలతో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

టైటిల్ రివీల్‌పై అంచనాలు

మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఇప్పటికే విలన్ పాత్రలో నటిస్తున్న పృథ్వీరాజ్ ‘కుంభ’ లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్ర టైటిల్‌ను నవంబర్ 15న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోయే భారీ ఈవెంట్‌లో ప్రకటించే అవకాశం ఉంది. ఈ వేడుక జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

Exit mobile version