Site icon HashtagU Telugu

SSMB 29 : మహేష్ – రాజమౌళి మూవీ టెక్నికల్‌ టీమ్‌ వీరే..!!

Mahesh Rajamouli Crew

Mahesh Rajamouli Crew

సూపర్ స్టార్ మహేష్ బాబు – రాజమౌళి (Mahesh Babu- Rajamouli) కలయికలో ఓ భారీ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటన వచ్చిన దగ్గరి నుండి అభిమానుల్లో , సినీ లవర్స్ లలో అంచనాలు తారాస్థాయికి వెళ్లాయి. మామూలుగానే రాజమౌళి సినిమా అంటేనే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి..అలాంటిది సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేస్తున్నాడంటే..ఇక ఆ అంచనాలకు అడ్డు అనేది ఉండదు. ప్రతిదీ ఓ సంచలనమే..ప్రస్తుతం ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లే పనుల్లో రాజమౌళి బిజీ గా ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మొన్నటి వరకు కథపై కసరత్తులు చేస్తూ వచ్చిన జక్కన్న..ఇక ఇప్పుడు టెక్నీకల్ టీం (Technical Crew ) ను సిద్ధం చేసాడు. సాధారణంగా రాజమౌళి అన్ని సినిమాలకు చాలా వరకు ఒకే టెక్నిషియన్స్ ఉంటారు. మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్, యాక్షన్ కొరియోగ్రాఫర్.. ఇలా చాలా మంది టెక్నిషియన్స్ రాజమౌళికి రెగ్యులర్ గా పని చేస్తారు. కానీ ఈ సినిమా కోసం రాజమౌళి కెమెరామెన్, ఎడిటర్, ప్రొడక్షన్ డిజైనర్.. పలువురిని మార్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు..ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్‌గా పి.ఎస్‌.వినోద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా మోహన్‌ బింగి, వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌ వైజర్‌గా ఆర్‌.సి.కమల్ కణ్ణన్‌, ఎడిటర్‌గా తమ్మిరాజు బాధ్యతలు సీక్వరించనున్నట్లు తెలుస్తుంది. ఇక కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా రాజమౌళి భార్య రమా రాజమౌళి వ్యవహరించబోతుంది. ఈ టెక్నీకల్ టీం ఫై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక ఈ సినిమా కోసం మహేష్ తన లుక్‌ను మార్చుకుంటున్నారు. జట్టు, గడ్డం పెంచుతున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. హీరోయిన్​గా ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్​ దాదాపు ఖాయంగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాను దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్​తో అత్యున్నత టెక్నాలజీని ఉపయోగించి తెరకెక్కించబోతున్న. ఇండియన్​ లాంగ్వేజెస్​తో పాటు విదేశీ భాషల్లోనూ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు పూర్తి చేసి..ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారో చూడాలి. ఎందుకంటే రాజమౌళి సినిమా అంటే మూడు నెలల్లో పూర్తి చేసి నాల్గో నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకరారు..షూటింగ్ ను త్వరగా పూర్తి చేసిన..ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు ఎక్కువ సమయం కేటాయిస్తారు..అందుకే రాజమౌళి తో సినిమా అంటే హీరోలు గట్టిగానే డేట్స్ ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది.

Read Also : Kadiam : కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్‌పై బురద జల్లే ప్రయత్నం చేస్తోందిః కడియం శ్రీహరి

Exit mobile version