Site icon HashtagU Telugu

SSMB29 ఫుల్ డీటైల్స్ అప్పుడే.. రాజమౌళి ప్లాన్ అంటే అలానే ఉంటుంది మరి..!

SSMB29 Details Mahesh Rajamouli Planing

SSMB29 Details Mahesh Rajamouli Planing

SSMB29 సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా గురించి రోజుకొక అప్డేట్ ఫ్యాన్స్ ని థ్రిల్ చేస్తుంది. కె ఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ తో విజువల్ వండర్ గా ప్లాన్ చేస్తున్నారు. సినిమా టెక్నికల్ టీం అంతా సిద్ధం కాగా త్వరలోనే సినిమాకు సంబందించిన వర్క్ షాప్ మొదలు పెట్టనున్నారట. ఇక ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ డీటైల్స్ ని త్వరలోనే ప్రకటించబోతున్నారని తెలుస్తుంది.

SSMB29 సినిమాకు సంబందించిన ఎక్స్ క్లూజివ్ డీటైల్స్ ని మహేష్ రాజమౌళి కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెబుతారని తెలుస్తుంది. సినిమా కాస్టింగ్ షూటింగ్ టైం ఇంకా రిలీజ్ డేట్ ని కూడా రాజమౌళి ఆ ప్రెస్ మీట్ లో అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. మహేష్ తో రాజమౌళి చేస్తున్న మొదటి సినిమాగా ఈ ప్రాజెక్ట్ పై తారాస్థాయి అంచనాలు ఉన్నాయి.

మహేష్ రాజమౌళి కాంబో సినిమాలో హాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తారన్న టాక్ ఉంది. దాని డీటైల్స్ కూడా ఆ ప్రెస్ మీట్ లో వెల్లడిస్తారని తెలుస్తుంది. సో ఈ సినిమా నుంచి ఇక మీదట వచ్చే వార్తలన్నిటిని పక్కన పెట్టి ఆ ప్రెస్ మీట్ కోసం ఎదురుచూస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.

Also Read : Mahesh Thank you Boss : మహేష్ థాంక్ యు బాస్ చెబుతున్నాడు.. సూపర్ స్టార్ క్రేజ్ కి ఇది నిదర్శనం..!