Site icon HashtagU Telugu

SSMB28 shoot Starts: ఎస్ఎస్ఎంబీ28 షూటింగ్ స్టార్ట్.. మహేశ్ లుక్ వైరల్!

Ssmb

Ssmb

మహేష్ బాబు, త్రివిక్రమ్ 12 సుదీర్ఘ సంవత్సరాల తర్వాత SSMB28 అనే ప్రాజెక్ట్ కోసం మళ్లీ కలుస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఈరోజు సెట్స్ పైకి వెళ్లింది. వీరిద్దరూ కలిసి పనిచేసిన రెండు సినిమాలు కామెడీ టచ్ తో ఖలేజా, అతడు వచ్చాయి. అయితే ఈసారి త్రివిక్రమ్ SSMB28 కోసం రూట్ మారుస్తున్నాడు. SSMB28 పూర్తిస్థాయి యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతోంది. అయితే త్రివిక్రమ్ ఈసారి హెవీ యాక్షన్ స్క్రిప్ట్‌ను రూపొందించినట్లు సమాచారం.

మొదటి షెడ్యూల్‌లో హై యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించనున్నారు. ఈ హెవీ షెడ్యూల్ ను ఈ నెలాఖరు వరకు మహేష్ చిత్రీకరించనున్నారు. అలాగే మహేష్‌కి సంబంధించిన లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పొడవాటి జుట్టు, గడ్డంతో ఇన్టెన్సివ్ లుక్ లో  కనిపిస్తాడు. ప్రస్తుతం లుక్ కోసం మహేశ్ ట్రైల్స్ వేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన రగ్డ్ లుక్‌లో కనిపిస్తున్నారని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 28, 2023న విడుదలవుతుందని ప్రకటించారు. టాక్ సరిగ్గా ఉంటే బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించే అవకాశం ఉంది.

Exit mobile version