Site icon HashtagU Telugu

SSMB 29 Trailer: నవంబర్ 15న మ‌హేష్ బాబు- రాజ‌మౌళి మూవీ ట్రైలర్ విడుదల?

SSMB 29 Trailer

SSMB 29 Trailer

SSMB 29 Trailer: రాజమౌళి- సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ SSMB 29 గురించిన అప్‌డేట్‌లు సినీ వర్గాల్లో, అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను పెంచుతున్నాయి. నిన్న (సోమవారం) అనూహ్యంగా విడుదలైన చిత్రంలోని మొదటి సింగిల్ ‘సంచారి’ అద్భుతమైన స్పందనతో దూసుకుపోతోంది. ఈ పాట విడుదల కావడంతో ఈ చిత్రం తదుపరి అప్‌డేట్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

నవంబర్ 15న మెగా ఈవెంట్, ఊహించని ట్విస్ట్!

SSMB 29 చిత్ర బృందం నవంబర్ 15న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మెగా ఈవెంట్‌ (SSMB 29 Trailer)ను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోందని ఇప్పటికే ప్రకటించింది. ఈ వేదికపై సినిమా గురించి ఎలాంటి కీలక ప్రకటన వస్తుందోనని మహేష్, రాజమౌళి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఈ ఈవెంట్ అధికారిక డిజిటల్ స్ట్రీమింగ్ భాగస్వామి అయిన జియో హాట్‌స్టార్ (Jio Hotstar) ఒక సంచలనాత్మక ట్వీట్‌తో మరింత ఆసక్తిని పెంచింది.

Also Read: Delhi Bomb Blast: డాక్ట‌ర్ ఉమ‌ర్ మ‌హ‌మ్మ‌ద్‌ బ్యాక్ గ్రౌండ్ ఏంటి..?

కొద్దిసేపటి క్రితం జియో హాట్‌స్టార్ తమ అధికారిక ఖాతాలో ఒక పోస్ట్ చేస్తూ.. నవంబర్ 15న జరగబోయే ఆ గ్రాండ్ ఈవెంట్‌లో SSMB 29 ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ కావడంతో మహేష్ బాబు, రాజమౌళి అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యం, ఆనందంలో మునిగిపోయారు. అయితే ఊహించని విధంగా ఆ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఆ ట్వీట్‌ను కొద్దిసేపటికే తొలగించింది.

పోస్ట్ డిలీట్ వెనుక కారణం ఏమై ఉంటుంది?

జియో హాట్‌స్టార్ పోస్ట్ తొలగించబడటం అభిమానుల్లో మరింత గందరగోళాన్ని సృష్టించింది. అసలు ట్రైలర్ విడుదల ఖరారైందా? లేదా సాంకేతిక లోపం వల్ల పోస్ట్ చేశారా అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ట్రైలర్ విడుదల అనేది సాధారణంగా సినిమా విడుదలకు కొద్ది నెలల ముందు జరుగుతుంది. ఈ కీలక అప్‌డేట్ ఇప్పుడే వస్తున్నట్లు ప్రకటించడం, అది కూడా సినిమా విడుదలకు చాలా ముందే విడుదల చేయడం, ఈ ప్రాజెక్ట్ గురించి అభిమానుల అంచనాలను రెట్టింపు చేసింది.

ఒకవేళ ట్రైలర్ నిజంగానే ఈవెంట్‌లో విడుదలైనట్లయిత సినిమా ఊహించిన దానికంటే త్వరగా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీ ఈవెంట్ కోసం అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆ రోజు ఎలాంటి అప్‌డేట్ వస్తుందో వేచి చూడాలి.

Exit mobile version