RRR Oscar Campaign: ఆస్కార్ క్యాంపెయిన్‌ ఖర్చుపై కార్తికేయ స్పష్టత.. విమర్శలకు చెక్..!

ఆర్ఆర్ఆర్' (RRR) విడుదలైన ఏడాది తర్వాత కూడా నిరంతరం వార్తలను సృష్టిస్తోంది. మార్చి 12న లాస్ ఏంజెల్స్‌లో జరిగిన 95వ అకాడమీ అవార్డ్స్‌లో ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రంలోని 'నాటు నాటు' పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును అందుకుంది.

  • Written By:
  • Publish Date - March 28, 2023 / 09:43 AM IST

‘ఆర్ఆర్ఆర్’ (RRR) విడుదలైన ఏడాది తర్వాత కూడా నిరంతరం వార్తలను సృష్టిస్తోంది. మార్చి 12న లాస్ ఏంజెల్స్‌లో జరిగిన 95వ అకాడమీ అవార్డ్స్‌లో ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డును అందుకుంది. ఆర్ఆర్ఆర్ లో ‘నాటు నాటు’ తెలుగు పాటకు ఆస్కార్‌ వచ్చిన వేళ కొందరు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అవార్డు కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారని, కొన్నారని ఇలా ఎవరికి తోచినట్లు వాళ్లు ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆర్ఆర్ఆర్ మూవీ లైన్‌ ప్రొడ్యూసర్‌ ఎస్‌.ఎస్‌.కార్తికేయ స్పష్టతనిచ్చారు. ఆస్కార్ క్యాంపెయిన్ కోసం ఆర్ఆర్ఆర్ బృందం భారీగా ఖర్చు పెట్టిందని, దాదాపు 80 కోట్లు వరకు వెచ్చించిందని పలు ఊహాగానాలు నెట్టింట హల్చల్ చేశాయి. తాజాగా వీటన్నింటిపై స్పష్టం ఇచ్చారు ఆర్ఆర్ఆర్ లైన్ ప్రొడ్యూసర్ ఎస్ఎస్ కార్తికేయ. ఆస్కార్ కొనుక్కోవచ్చన్నది పెద్ద జోక్ అని ఒక్క మాటతో తేల్చిపడేశారు.

ఆర్‌ఆర్‌ఆర్ కు భారతదేశం నుంచి అధికారికంగా ఆస్కార్‌ ఎంట్రీ లభించనప్పుడు కాస్త బాధ అనిపించింది. సినిమా పంపి ఉంటే ఇంకాస్త బలంగా ఉండేది. ఆస్కార్‌ కోసం క్యాంపెయిన్‌ చేసినప్పుడు అనేక వార్తలు వచ్చాయి. బోలెడంత డబ్బు ఖర్చు చేశారని, ఆస్కార్‌ టీమ్‌ను కొనేశారని, ఆస్కార్‌ టికెట్ల కోసం కూడా ఎక్కువ ఖర్చు పెట్టారని’ వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, ప్రేమ్‌రక్షిత్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవలు ఆస్కార్‌ కమిటీ ఆహ్వానితులు. కీరవాణి బాబాయ్‌, చంద్రబోస్‌లు నామినేషన్‌లో ఉన్నారు. కమిటీ పిలిచిన వాళ్లు, నామినేషన్స్‌లో వాళ్లు తప్పితే, ప్రతి సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక బృందాలు టికెట్‌ కొనాల్సిందే. ఇందుకోసం నామినేషన్స్‌లో ఉన్నవాళ్లు ఆస్కార్‌ కమిటీకి మెయిల్‌ చేయాలి. ఆ టికెట్‌లలో కూడా వివిధ రకాల క్లాస్‌లు ఉంటాయి. మా ఫ్యామిలీ కోసం కీరవాణి బాబాయ్‌ ఆస్కార్‌ వాళ్లకు మెయిల్‌ చేశారు. వాళ్లు అన్నీ సరిచూసుకున్న తర్వాత మెయిల్‌కు రిప్లై ఇస్తూ లింక్‌ పంపారు. అలా మేము ఒక్కో టికెట్‌ 1500 డాలర్లు పెట్టి కొన్నాం. మరో నలుగురి కోసం 750 డాలర్లు పెట్టి కొన్నాం. ఇదంతా అధికారికంగా జరిగింది’’ అని తెలిపాడు.

Also Read: Actress Ruchismita Guru: ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ నటి.. కారణమిదే..?

‘‘ఆస్కార్‌ క్యాంపెయిన్‌ చేయడం కోసం హాలీవుడ్‌ సినిమా వాళ్లు పలు స్టూడియోలను ఆశ్రయిస్తారు. మాకు అలాంటి ఆస్కారం లేదు. క్యాంపెన్‌ కోసం మేము అనుకున్న బడ్జెట్‌ రూ.5 కోట్లు. అది కూడా ఎక్కువ అనిపించింది. వీలైనంత ఖర్చు తగ్గిద్దామని ప్రయత్నించాం. దాన్ని మూడు దశల్లో ఖర్చు చేయాలనుకున్నాం. మొదటి ఫేజ్‌లో రూ.3 కోట్లు ఖర్చు చేశాం. నామినేషన్స్‌ వచ్చిన తర్వాత మరికొంత బడ్జెట్‌ పెంచాం. మొత్తం క్యాంపెన్‌కు రూ.5, 6 కోట్లు అవుతుందనుకున్నాం. చివరకు రూ.8.5కోట్లు అయింది. న్యూయార్క్‌, లాస్‌ ఏంజిల్స్‌లో మరిన్ని స్క్రీనింగ్స్‌ వేయాల్సి వచ్చింది’’అని కార్తికేయ వివరించారు.