SS Rajamouli : ఆస్కార్స్ అకాడమీలోకి రాజమౌళి దంపతులు.. ఇండియన్స్ జాబితా ఇదీ

రాజమౌళి.. మూవీ డైరెక్షన్‌లో విశ్వవిఖ్యాతిని సొంతం చేసుకున్నారు. 

  • Written By:
  • Updated On - June 26, 2024 / 12:08 PM IST

SS Rajamouli: రాజమౌళి.. మూవీ డైరెక్షన్‌లో విశ్వవిఖ్యాతిని సొంతం చేసుకున్నారు.  బాహుబలి 1, 2 చిత్రాలతో యావత్ ప్రపంచానికి తన సత్తా ఏంటో చూపించారు. ఆర్ఆర్ఆర్ మూవీతో ఆస్కార్ అవార్డును పొందారు. హాలీవుడ్ అంతా టాలీవుడ్ వైపు చూసేలా చేసిన ఘనత రాజమౌళికి దక్కింది. తాజాగా ఆయన మరో అరుదైన ఘనత  దక్కింది. ప్రఖ్యాత ఆస్కార్స్ అకాడమీని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(AMPAS) అని పిలుస్తారు. దీనిలో సభ్యులుగా చేరాలంటూ రాజమౌళికి, ఆయన సతీమణి రమా రాజమౌళికి ఆహ్వానం అందింది. సినిమా డైరెక్టర్ల విభాగంలో రాజమౌళికి, కాస్టూమ్ డిజైనర్స్ కేటగిరీలో రమా రాజమౌళికి ఈ ఇన్విటేషన్ లభించింది.

We’re now on WhatsApp. Click to Join

ప్రపంచవ్యాప్తంగా 57 దేశాలకు చెందిన 487 మందికి ఆస్కార్స్ అకాడమీ నుంచి ఈవిధంగా ఆహ్వానం అందింది. ఆస్కార్స్ అకాడమీలో సభ్యులుగా చేరితే  దక్కే గుర్తింపు ఏమిటంటే.. ఇందులో సభ్యులుగా ఉండేవారు 2025 సంవత్సరానికిగానూ ఆస్కార్‌ అవార్డులకు సినిమాలను ఎంపిక చేసే క్రమంలో జరిపే ఓటింగ్‌లో పాల్గొనవచ్చు. ఈ అకాడమీలో చేరాక రాజమౌళి దంపతులకు కూడా ఆ అవకాశం దక్కుతుంది. వారికి ఈ గుర్తింపు దక్కడంపై టాలీవుడ్‌లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read :Trains Cancelled : 78 రైళ్లు రద్దు.. 26 ఎక్స్‌ప్రెస్‌లు దారిమళ్లింపు

ఆస్కార్స్ అకాడమీలో ఇంకా ఇండియన్స్.. 

ప్రఖ్యాత ఆస్కార్స్ అకాడమీ నుంచి రాజమౌళి, రమా రాజమౌళితో పాటు రితేశ్​ సిధ్వాని, షబానా అజ్మీ, రీమా దాస్, రవి వర్మన్, ఆనంద్ కుమార్ టక్కర్, శీతల్ శర్మ, హేమల్ త్రివేది, నిషా పహుజా, గితేశ్​ పాండ్యాలకు కూడా ఆహ్వానం వచ్చింది. గత సంవత్సరం ఈ అకాడమీలో చోటు దక్కించుకున్న భారతీయ సినీ ప్రముఖుల్లో జూనియర్ ఎన్టీఆర్, ​ రామ్ చరణ్, చంద్రబోస్, ఎంఎం కీరవాణి, కె కె సెంథిల్ కుమార్, సాబు సిరిల్ వంటి వారు ఉన్నారు.

రాజమౌళి – మహేష్ బాబు సినిమాపై కీలక వివరాలు

రాజమౌళి – మహేష్ బాబు సినిమాపై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ఈ మూవీపై ఇటీవలే ఎం.ఎం. కీరవాణి కీలక వివరాలను వెల్లడించారు. ఈ వారమే స్టోరీ లాక్‌ అయిందని.. టెస్ట్‌ షూట్స్‌ జరుగుతున్నాయని చెప్పారు. జులై లేదా ఆగస్టులో మ్యూజిక్‌ వర్క్‌ స్టార్ట్‌ చేస్తానని కీరవాణి తెలిపారు. టెస్ట్‌ షూట్స్‌ కోసం కేవలం తెలుగు నటీనటులనే కాకుండా, హిందీ, తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులను కూడా పిలుస్తున్నారని సమాచారం. క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల ఎంపిక పూర్తి అయ్యాక, ప్రధాన పాత్రల పై జక్కన్న ఫోకస్ పెడతారని అంటున్నారు. ఈ మూవీలో ఓ హీరోయిన్‌గా చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ నటించనున్నట్లు చెబుతున్నారు.