Site icon HashtagU Telugu

SSMB29: మహేశ్- రాజమౌళి సినిమా నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. అలాంటి క్యారెక్టర్ లో సూపర్ స్టార్?

Mixcollage 20 Feb 2024 08 46 Am 74

Mixcollage 20 Feb 2024 08 46 Am 74

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు, దర్శక దీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఒక ప్రాజెక్టు రాబోతోంది అంటూ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు చాలామంది ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాని ఇండియానా జోన్స్ లాంటి కథతో అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో రాజమౌళి రూపొందించబోతున్నారు. ఇదే విషయాన్ని అధికారీకంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మహేష్ ఈ సినిమాలో నటించడానికి సిద్ధమవుతుండగా మరొకవైపు దర్శకుడు రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులను చూసుకుంటూ బిజీ బిజీగా ఉన్నారు.

ఇది ఇలా ఉంటే ఇటీవల కాలంలో మహేష్ జక్కన్న కాంబినేషన్లో రాబోతున్న సినిమా గురించి అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో మహేష్ పాత్ర చాలా ఇంటెన్స్‌గా ఉంటుందట. సాలిడ్ వేరియేషన్స్‌తో మస్త్ షేడ్స్ ఉన్న పాత్రలో మహేశ్ కనిపిస్తారని టాక్. అయితే ఇప్పటివరకూ మహేశ్ ఇలాంటి పాత్రే చేయలేదని ఆ రేంజ్‌లో హైలెట్‌గా క్యారెక్టర్‌ ఉంటుందట.

ఇక ఈ సినిమా కోసం తన లుక్ కూడా ఛేంజ్ చేస్తున్నారట మహేశ్ బాబు. ఇక ఈ సినిమాలో క్యాస్టింగ్‌పై కూడా చాలానే వార్తలు వస్తున్నాయి. అలానే ఈ సినిమాకి మహారాజా అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్లు ఇటీవల రూమర్స్ వచ్చాయి. అయితే ఈ సినిమాను 2025 మొదలు పెట్టబోతున్నట్లు నిర్మాత గోపాల్ రెడ్డి ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానుల ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుండగా, మూవీ మేకర్స్ మాత్రం ఈ సినిమాను అంతకంతకూ లేట్ చేస్తూ వెళ్తున్నారు..