Site icon HashtagU Telugu

SRK Request Modi: మోడీజీ.. ఒకరోజు లీవ్ తీసుకొని, ఎంజాయ్ చేయండి!

Sharukh

Sharukh

ప్రధాని నరేంద్ర మోదీ 72వ పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్  శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని విష్ చేసేందుకు షారుఖ్ ట్విట్టర్‌లోకి వెళ్లాడు.  అందరి కన్నా భిన్నంగా విషెష్ చెప్పడం ఆసక్తిని కలిగించింది.  ఒకరోజు సెలవు తీసుకొని ఆ రోజును ఆనందించమని మోడీని షారుఖ్ కోరాడు.

“మన దేశం, ప్రజల సంక్షేమం కోసం మీ అంకితభావాన్నిప్రశంసించకుండా ఉండలేం. మీ అన్ని లక్ష్యాలను సాధించడానికి మీకు బలం, ఆరోగ్యంగా ఉండండి” అని షారుఖ్ అన్నాడు.  మోడీ బర్తేడ్ సందర్భంగా బాలీవుడ్, టాలీవుడ్ హీరోలు మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు.