Site icon HashtagU Telugu

Pawan Kalyan : పవన్‌కి సలార్ భామ మద్దతు ట్వీట్.. సీనియర్ నటి రాధిక సైతం..

Sriya Reddy Raadhika Sarathkumar Supporting Tweets To Pawan Kalyan

Sriya Reddy Raadhika Sarathkumar Supporting Tweets To Pawan Kalyan

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సినిమా పరిశ్రమ నుంచి భారీ మద్దతే లభిస్తుంది. చిన్న యాక్టర్ నుంచి ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి వరకు ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతూ వస్తున్నారు. ఈక్రమంలోనే సినీ నటీమణులు కూడా పవన్ కి తమ మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా సలార్ భామ శ్రియారెడ్డి, సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ సైతం పవన్ కి మద్దతు తెలుపుతూ ట్వీట్స్ చేసారు.

“పిఠాపురం ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు గెలవాలని కోరుకుంటున్నాను. మీకు ఎల్లప్పుడూ ఆ దేవుడు మరియు ప్రజల ఆశీర్వాదాలు ఉంటాయి” అంటూ శ్రియారెడ్డి ట్వీట్ చేసారు. ఈ యాక్ట్రెస్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘ఓజి’ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. శ్రియారెడ్డి నుంచి పవన్ కి మద్దతుగా ట్వీట్ రావడంతో.. పవర్ స్టార్ అభిమానులు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక సీనియర్ నటి రాధిక ట్వీట్ చేస్తూ.. “ప్రజలకు మీరు (పవన్ కళ్యాణ్) చేసే సేవలకు మరింత బలం చేకూర్చేలా, ఈ ఎన్నికల్లో మీరు గెలవాలని కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అంటూ రాసుకొచ్చారు. తన తోటి నటి రోజాని కాకుండా రాధిక.. పవన్ ని సపోర్ట్ చేయడం పట్ల చిరు అండ్ పవన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

కాగా నేడు రామ్ చరణ్ తన తల్లి సురేఖతో కలిసి పిఠాపురం వస్తున్నారు. పిఠాపురం కుక్కుటేశ్వర ఆలయాన్ని సందర్శించుకొని బాబాయ్ గెలుపు కోసం ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇక ఈ పర్యటనలో రామ్ చరణ్ ఏం మాట్లాడతారు అనేది అందరిలో ఆసక్తిగా మారింది.