Site icon HashtagU Telugu

Rashmika Mandanna : పుష్ప 2 ప్రమోషన్స్ ఓ వైపు.. శ్రీవల్లి చీర అందాలు మరోవైపు..!

On and Off Rashmika Full Marks for Pushpa 2 Allu Arjun

On and Off Rashmika Full Marks for Pushpa 2 Allu Arjun

ఓ పక్క డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్న పుష్ప 2 ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ అంతా బిజీ బిజీగా ఉంది. రీసెంట్ గా కొచ్చిలో పుష్ప 2 ప్రమోషనల్ ఈవెంట్ జరిగింది. ఐతే ఈవెంట్స్ లో శ్రీవల్లి (Srivalli) అదే రష్మిక అప్పియరెన్స్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. రష్మిక ఆన్ స్క్రీన్ మీదే కాదు ఆఫ్ స్క్రీన్ మీద కూడా అదరగొట్టేస్తుంది.

పుష్ప 2 ప్రమోషన్స్ లో పాల్గొనడమే కాకుండా తన చీర అందాలను ప్రదర్శిస్తూ తన ఫ్యాన్స్ ని కూడా ఇంప్రెస్ చేస్తుంది అమ్మడు. శ్రీవల్లి గ్లామర్ హంగామా ఆమె ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ అందిస్తుంది. పాన్ ఇండియా లెవెల్ లో రష్మికకు ఉన్న ఫాలోయింగ్ పుష్ప 2 తో డబుల్ అయ్యేలా ఉంది.

గ్రీన్ కలర్ శారీలో..

లేటెస్ట్ గా థిక్ గ్రీన్ కలర్ శారీలో రష్మిక (Rashmika) అందాల ప్రదర్శన ఆడియన్స్ ను ఖుషి చేస్తుంది. పుష్పలో శ్రీవల్లి గానే కాదు ఆఫ్ స్క్రీన్ రష్మిక కూడా ఎప్పుడు తన ఫ్యాన్స్ లో జోష్ నింపేందుకు ప్రయత్నిస్తుందని చెప్పొచ్చు.

పుష్ప 1లో పుష్ప రాజ్, శ్రీవల్లి రొమాన్స్ అలరించగా పుష్ప 2 లో దాన్ని మరింత స్ట్రాంగ్ గా చూపించబోతున్నారు. సుకుమార్ ఈ విషయంలో నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేశాడని అర్ధమవుతుంది. ఆల్రెడీ యానిమల్ (Animal) సినిమాతో నేషనల్ లెవెల్ లో సూపర్ హిట్ అందుకున్న రష్మిక పుష్ప 2 (Pushpa 2) తో మరో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉంది. తప్పకుండా పుష్ప 2 సినిమా రష్మిక కెరీర్ కు మరింత బూస్టింగ్ ఇస్తుందని అనిపిస్తుంది.

Also Read : Varun Tej : వరుణ్ తేజ్ సినిమా నుంచి నిర్మాతలు ఎగ్జిట్..!