Shriram Natarajan : ఈ ‘నగరం’ హీరోకు ఏమైంది..? హాస్పటల్ లో ఎందుకున్నాడు ..?

Shriram Natarajan : ఆరోగ్య నోట్‌లో శ్రీరామ్ పరిస్థితి సురక్షితంగా ఉందని చెప్పినా, అసలు సమస్య ఏమిటి అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు

Published By: HashtagU Telugu Desk
Shriram Natarajan

Shriram Natarajan

తమిళ సినిమా ‘నగరం’ (Nagaram) ఫేమ్ హీరో శ్రీరామ్ నటరాజన్ (Shriram Natarajan) హాస్పిటల్‌లో చేరిన సంగతి అభిమానుల్లో కలకలం రేపింది. తాజాగా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Director Lokesh Kanagaraj) తన సోషల్ మీడియా అకౌంట్‌లో శ్రీరామ్ ఆరోగ్యంపై ఒక స్పెషల్ నోట్‌ను పంచుకున్నారు. ఈ నోట్ శ్రీరామ్ కుటుంబ సభ్యుల తరఫున విడుదలైనదిగా తెలిపారు. శ్రీరామ్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని, డాక్టర్ల సలహా మేరకు సోషల్ మీడియా నుంచి విరామం తీసుకున్నారని అందులో పేర్కొన్నారు. ఆయన ప్రైవసీని గౌరవించాలని, ఆరోగ్యంపై అనవసర ఊహాగానాలు చేయకుండా, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని అభిమానులకు, మీడియాలోకి విజ్ఞప్తి చేశారు.

Ginger Tea: వేసవికాలంలో అల్లం టీ తాగవచ్చా తాగుకూడదా? తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

శ్రీరామ్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉండటంతో, ఆయన ఆరోగ్యం పట్ల సందేహాలు మొదలయ్యాయి. పాత ఫోటోలు, ప్రస్తుత రూపంలో వచ్చిన మార్పు అభిమానుల్లో అనేక ప్రశ్నలు రేకెత్తించాయి. ఇంతకుముందు రెమ్యూనరేషన్ ఇవ్వలేదని ఆరోపించిన శ్రీరామ్, అనంతరం మిస్సవ్వడం మరింత గందరగోళానికి దారి తీసింది. ఆయన గుర్గాన్‌లో ఉన్నారని ట్రేస్ చేసిన వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇక ఆయన స్కిజోఫ్రెనియా అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు కూడా కొన్ని మీడియాలో ప్రచారం జరిగింది. దీనివల్ల అభిమానులు ఆయనకు సహాయం కావాలంటూ సోషల్ మీడియాలో రిక్వెస్టులు చేస్తున్నారు.

తాజాగా విడుదలైన ఆరోగ్య నోట్‌లో శ్రీరామ్ పరిస్థితి సురక్షితంగా ఉందని చెప్పినా, అసలు సమస్య ఏమిటి అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఆయన త్వరగా కోలుకుని తిరిగి సినిమా రంగంలోకి వస్తారని కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీరామ్ చివరిసారిగా 2023లో ‘ఇరుగపత్రు’ సినిమాలో నటించాడు. మానగరం, వజక్కు ఎన్, ఓనాయుమ్ ఆటుకుట్టియుమ్ వంటి చిత్రాలలో నటించి తనదైన ముద్ర వేసుకున్న ఆయన త్వరగా కోలుకోవాలని సినీప్రియులు ఆకాంక్షిస్తున్నారు.

  Last Updated: 18 Apr 2025, 02:29 PM IST