Site icon HashtagU Telugu

Rajamouli : రాజమౌళి ఆలా హీరోయిన్ల బిస్కెట్లకు పడిపోతాడా..?

Srindhi Rajamouli

Srindhi Rajamouli

హైదరాబాద్‌లో జరిగిన నాని నటించిన ‘హిట్ 3’ (HIT3)ప్రీ-రిలీజ్ ఈవెంట్‌(Prerelease)లో హీరోయిన్ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) దర్శక దిగ్గజం రాజమౌళి (Rajamouli) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి సినిమాల్లోని భావోద్వేగాలు, కథనం ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తాయని ఆమె కొనియాడారు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలతో తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని ఆమె ప్రశంసలు కురిపించారు. తనకు రాజమౌళితో పనిచేయాలనే ఆకాంక్ష ఉందని, అది తన కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు.

HCL Foundation : 2025 HCLTech గ్రాంట్ ను ప్రకటించిన HCL ఫౌండేషన్

శ్రీనిధి తన మొదటి సినిమా ‘కేజీఎఫ్ 1’ సమయంలో కూడా హైదరాబాద్‌లో రాజమౌళిని కలిసిన సందర్భాన్ని గుర్తు చేశారు. ఆ సినిమా ఘన విజయాన్ని సాధించిందని, ఇప్పుడు మళ్లీ తన తెలుగు డెబ్యూ “హిట్ 3″కి రాజమౌళి గెస్ట్‌గా రావడం తనకు శుభసూచకంగా భావిస్తున్నట్లు తెలిపారు. రాజమౌళి రావడం వల్ల తాను ఎంతో థ్రిల్ ఫీలయ్యానని చెప్పిన శ్రీనిధి, ఈ సినిమా కూడా విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజమౌళి కూడా నాని నటనను పొగడ్తలతో ముంచెత్తారు. ‘హిట్ 3’ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. శ్రీనిధి శెట్టి, రాజమౌళి మధ్య జరిగిన సన్నిహిత సంభాషణ ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారిద్దరి మధ్య పరస్పర గౌరవం, అభిమానాన్ని స్పష్టంగా చూడగలిగారు. భవిష్యత్తులో శ్రీనిధి శెట్టి – రాజమౌళి కలయిక ప్రేక్షకులకు మధురమైన అనుభూతిని ఇవ్వగలదని ఆశిస్తున్నారు. మరి రాజమౌళి శ్రీనిధి కి ఛాన్స్ ఏమైనా ఇస్తాడేమో చూడాలి. ప్రస్తుతం రాజమౌళి మహేష్ తో ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది.