Site icon HashtagU Telugu

Srimukhi : శ్రీముఖి హాట్ & స్పైసి లుక్

Srimukhi New Pic

Srimukhi New Pic

హాట్ & స్పైసి లుక్ లో శ్రీముఖి (Srimukhi ) అబ్బా అనిపించింది. నటిగా జులాయి మూవీ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి.. పవన్ సాదినేని దర్శకత్వం వహించిన ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాతో హీరోయిన్ అవతారం ఎత్తింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవడంతో శ్రీముఖి హీరోయిన్‌గా నిలబడలేకపోయింది. ఆ తర్వాత తమిళం, కన్నడలోనూ సినిమాలు చేసింది. ఇక నేను శైలజా, జెంటిల్ మెన్, భోళా శంకర్ ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ బిజీ నటి కాలేకపోయింది. అయినప్పటికీ సోషల్ మీడియా తో పాటు బుల్లితెరపై సందడి చేస్తూ వస్తుంది.

తాజాగా థాయిలాండ్‌లోని ఫుకెట్ బీచ్‌లో శ్రీముఖి బ్లాక్ బీచ్ వేర్ లో స్టన్నింగ్ లుక్‌లో కనిపించి అబ్బా అనిపించింది. ఈ మధ్య శ్రీముఖి నుండి ఈ తరహా హాట్ & స్పైసి లుక్ రాకపోయేసరికి వీటిని చూసి నెటిజన్లు , అభిమానులు ఆ పిక్స్ ను వైరల్ చేస్తున్నారు. బీచ్ బ్రీజ్, సముద్రపు వెన్యూ ఆమె అందాన్ని మరింత హైలైట్ చేసాయి. మోకాళ్ల వరకూ ఉన్న స్కర్ట్, నెట్ మేస్ టాప్‌తో ఆమె లుక్ మరింత గ్లామర్‌గా కనిపించేలా చేసాయి. ‘బికినీ కంటే స్టైలిష్ గా ఉంది’, ‘ట్రెడిషనల్ యాంకర్ గ్లామర్ డోస్ పెంచింది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version