Srileela – Rashi Khanna : శ్రీలీల ఎగ్జిట్ రాశి ఖన్నా ఎంటర్.. క్రేజీ ప్రాజెక్ట్ లో లక్కీ ఛాన్స్..!

Srileela - Rashi Khanna రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో వచ్చిన పెళ్లిన్సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీ లీల ఆ తర్వాత రవితేజతో చేసిన ధమాకాతో సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత అమ్మడు వరుస క్రేజీ ప్రాజెక్ట్

Published By: HashtagU Telugu Desk
Srileela Exit Rashi Khanna In Crazy Project

Srileela Exit Rashi Khanna In Crazy Project

Srileela – Rashi Khanna రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో వచ్చిన పెళ్లిన్సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీ లీల ఆ తర్వాత రవితేజతో చేసిన ధమాకాతో సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత అమ్మడు వరుస క్రేజీ ప్రాజెక్ట్ లతో అదరగొట్టేసింది. అయితే వరుస సినిమాలు చేసినా కూడా వాటిలో సక్సెస్ అందుకున్నవి మాత్రం చాలా తక్కువ. లాస్ట్ ఇయర్ బాలయ్య భగవంత్ కేసరి, ఈ ఇయర్ గుంటూరు కారం ఈ రెండు తప్ప మిగతా సినిమాలన్నీ శ్రీ లీలకు షాక్ ఇచ్చాయి.

సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా ఆఫర్లు వస్తున్నా అమ్మడు మాత్రం ఇక మీదట ఆచి తూచి అడుగులేయాలని చూస్తుంది. ఈ క్రమంలో నితిన్ తో చేయాల్సిన సినిమా నుంచి శ్రీ లీల బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. వెంకీ కుడుముల డైరెక్షన్ లో నితిన్ హీరోగా వస్తున్న రాబిన్ హుడ్ సినిమాలో రష్మిక హీరోయిన్ గా అనుకోగా ఆమె డేట్స్ అడ్జెస్ట్ లేక కాదనేసింది. ఆ సినిమాలో శ్రీ లీల నటిస్తుందని చెప్పుకోగా లేటేస్ట్ గా ఆ సినిమా నుంచి శ్రీ లీల ఎగ్జిట్ అవ్వడంతో రాశి ఖన్నా ఆ ఛాన్స్ అందుకుందట.

తెలుగులో రాశి ఖన్నా దూకుడు తగ్గింది అనిపించగా మళ్లీ అమ్మడు వరుస ప్రాజెక్ట్ లను అందుకుంటుంది. నితిన్ తో శ్రీనివాస కళ్యాణం సినిమాలో నటించిన రాశి ఖన్నా మళ్లీ ఇన్నాళ్లకు కలిసి జత కడుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా మళ్లీ భీష్మ లాంటి హిట్ రిపీట్ చేయాలని చూస్తున్నారు వెంకీ కుడుముల, నితిన్.

తెలుగులో రాశి ఖన్నా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో చిన్నగా అమ్మడు కోలీవుడ్ వైపు వెళ్లింది. అక్కడ కూడా స్టార్ క్రేజ్ తెచ్చుకోలేదు కానీ వరుస సినిమాలు చేస్తూ వస్తుంది. అయితే తెలుగులో ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో భాగం అవ్వడంతో మళ్లీ రాశి ఖన్నా బౌన్స్ బ్యాక్ అయినట్టే అని చెప్పుకుంటున్నారు.

Also Read : Nidhi Agarwal : ఇస్మార్ట్ బ్యూటీకి రెబల్ స్టార్ ఛాన్స్.. వర్క్ అవుట్ అయితే మాత్రం దశ తిరిగినట్టే..!

  Last Updated: 16 Apr 2024, 05:16 PM IST