Srileela Classical Dance Video : కుర్చీ మడతపెట్టే కాదు కూచుపుడి భరతనాట్యం కూడా ఇరగదీస్తుంది..!

Srileela Classical Dance Video నేటితరం యువ హీరోయిన్స్ లో అనం అభినయం లోనే కాదు డాన్స్ తో అదరగొట్టేస్తుంది శ్రీ లీల. ఒక తెలుగు అమ్మాయి అన్నిటిలో పర్ఫెక్ట్ అనిపించుకోవడం అందులోనూ స్టార్ ఛాన్స్

Published By: HashtagU Telugu Desk
Srileela Classical Dance Video Viral On Social Media

Srileela Classical Dance Video Viral On Social Media

Srileela Classical Dance Video నేటితరం యువ హీరోయిన్స్ లో అనం అభినయం లోనే కాదు డాన్స్ తో అదరగొట్టేస్తుంది శ్రీ లీల. ఒక తెలుగు అమ్మాయి అన్నిటిలో పర్ఫెక్ట్ అనిపించుకోవడం అందులోనూ స్టార్ ఛాన్స్ లతో దూసుకెళ్లడం తెలుగు ప్రేక్షకులకు సంతోషంగా ఉంది. హిట్లు ఫ్లాపులు సంగతి అలా ఉంచితే శ్రీ లీల డాన్స్ కోసం అయినా సినిమా చూడాలి అనిపించేలా చేసింది అమ్మడు.

ఈ సంక్రాంతికి వచ్చిన మహేష్ గుంటూరు కారం లో మరోసారి తన డాన్స్ మేనియాతో అదరగొట్టేసింది శ్రీ లీల. ఆ సినిమాలో కుర్చీ మడతపెట్టి సాంగ్ తో థియేటర్లని షేక్ చేసిన శ్రీ లీల తను ఆ వెస్ట్రెన్ డాన్స్ మాత్రమే కాదు క్లాసికల్ డాన్స్ లో కూడా ఇరగదీస్తానని ప్రూవ్ చేసుకుంది.

రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన సమతా కుంభ్ 2024 కార్యక్రమంలో భాగంగా శ్రీ లీల కాల్సికల్ డాన్స్ అందరినీ ఆకట్టుకుంది. 10 నిమిషాల పాటు శ్రీ లీల చేసిన క్లాసికల్ డాన్స్ చూసేందుకు రెండు కళ్లు సరిపోలేదని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ డాన్స్ కి సంబందించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కుర్చీ మడతపెట్టి లాంటి మాస్ సాంగ్స్ కే కాదు క్లాసికల్ డాన్స్ లో కూడా తనకి తానే సాటి అనిపించేలా టాలెంట్ ప్రూవ్ చేసుకుంటుంది శ్రీ లీల.

ఏది ఏమైనా ఒక మనిషిలో ఇన్ని టాలెంట్ లు ఉండటం నిజంగానే గొప్ప విషయమని చెప్పొచ్చు. శ్రీ లీల చేసిన క్లాసికల్ డాన్స్ వీడియో ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది.

  Last Updated: 02 Mar 2024, 07:08 PM IST