Site icon HashtagU Telugu

Tollywood : మహేష్ ఫై ప్రశంసల జల్లు కురిపించిన శ్రీకాంత్ అడ్డాల

Srikanth Addala Mahesh

Srikanth Addala Mahesh

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఫై ప్రశంసల జల్లు కురిపించి వార్తల్లో నిలిచారు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala). కొత్త బంగారులోకం మూవీ తో డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచమైన శ్రీకాంత్ అడ్డాల..మొదటి సినిమాతోనే ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత వెంకటేష్ – మహేష్ లను హీరోలుగా పెట్టి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేసారు. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పాల్సిన పనిలేదు.

ఈ మూవీ సూపర్ హిట్ తర్వాత శ్రీకాంత్ కు మహేష్ మరో ఛాన్స్ ఇచ్చాడు. బ్రహ్మోత్సవం (Brahmotsavam) టైటిల్ తో శ్రీకాంత్ సినిమా చేసాడు. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ డిజాస్టర్ అయ్యింది. మహేష్ కెరియర్ లోనే ఓ బ్యాడ్ ఫిలిం గా నిలిచింది. అంతటి డిజాస్టర్ ఇచ్చిన కూడా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలను మహేష్ బాబు ఏ మాత్రం విమర్శించ లేదటా.. ఈ విషయాన్ని స్వయంగా శ్రీకాంత్ అడ్డాలనే చెప్పుకొచ్చాడు. తాజాగా శ్రీకాంత్ పెద్దకాపు 1 (Pedakapu 1) సినిమా చేసాడు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమం లో భాగంగా మీడియా తో మాట్లాడుతూ బ్రహ్మోత్సవం సినిమా గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహేష్ బాబు కి ఆ సినిమా పై ఎంతో నమ్మకం ఉండేది. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం తో ఆయన తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేశారు. కానీ నా వద్ద ఏమాత్రం అసహనం తో మాట్లాడలేదని శ్రీకాంత్ అడ్డాల తెలియజేశారు. మనం మంచి ప్రయత్నం చేశాం కానీ వర్క్ అవుట్ అవ్వలేదు.తప్పకుండా మళ్లీ కలిసి వర్క్ చేద్దాం అన్నట్లుగా వ్యాఖ్యలు చేశారని శ్రీకాంత్ అడ్డాల చెప్పుకొచ్చారు. ఒక డిజాస్టర్ ఇచ్చిన కూడా దర్శకుని తో నార్మల్ గా మాట్లాడటం కేవలం మహేష్ బాబుకి మాత్రమే చెల్లుతుంది అంటూ శ్రీకాంత్ అడ్డాల పేర్కొన్నారు.

Read Also : Nara Lokesh : నారా లోకేశ్‌ ఫై సీఐడీ కేసు.. అరెస్ట్ చేస్తారా..?

Exit mobile version