Site icon HashtagU Telugu

Sridevi Rejected Baahubali: బాహుబలి ‘శివగామి’ పాత్రను శ్రీదేవి ఎందుకు రిజక్ట్ చేశారో తెలుసా!

Sridevi

Sridevi

దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన బాహుబలి (Baahubali) మూవీ ఎంతటి సంచలన విజయాలు నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ ప్రేక్షకుల మనసులో మెదిలిలే చాలు.. భళ్లాలదేవ, బాహుబలి పాత్రలతో పాటు శివగామీ లాంటి పవర్ క్యారెక్టర్ ప్రతిఒక్కరికీ గుర్తుకువస్తోంది. రాజమాతగా శివగామిగా నటించిన రమ్యకృష్ణ పాత్రను అంత ఈజీగా ఎవరూ మరిచిపోలేరు. నా మాటే శాసనం అంటూ రౌద్రమైన నటనను ఎలివేట్ చేశారామే. ఈ సినిమా విడుదలై సంవత్సరాలు గడుస్తున్నా.. శివగామి పాత్ర సో స్సెషల్ అని చెప్పక తప్పదు.

అయితే బాహుబలిలో శివగామి పాత్ర మొదట అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi) ని వరించింది. బాహుబలిలో రమ్యకృష్ణ పోషించిన పాత్రలో శ్రీదేవి నటించాల్సి ఉంటుందని చాలామందికి తెలియదు. ఈ పాత్ర కోసం శ్రీదేవిని రాజమౌళి కలిసినప్పుడు దర్శకుడు S S రాజమౌళికి శ్రీదేవి (Sridevi) చాలా డిమాండ్లు పెట్టిందట. ఆర్థిక,  ఇతరత్రా వల్ల బాహుబలి లాంటి సినిమాను మిస్ చేసుకుంది.  ఈ విషయం అప్పట్లో వైరల్ కావడంతో దీనిపై శ్రీదేవి ఘాటుగా స్పందించారు. ‘రాజమౌళి అలా మాట్లాడతాడనే నేను అస్సలు నమ్మలేదు. రెండోది నేను ఎలాంటి డిమాండ్‌లు చేయలేదు’ అని ఓ జర్నలిస్టుతో అన్నారు. నేను తిరస్కరించిన చాలా పాత్రలు ఉన్నాయి. చేయని సినిమాల గురించి మాట్లాడటం మంచిది కాదని శ్రీదేవి అన్నారు.

శ్రీదేవి (Sridevi)  మాటలను రాజమౌళి ఖండించలేదు. కానీ బహిరంగంగా దాని గురించి మాట్లాడినందుకు చింతించాడు.  శ్రీదేవి సాధించిన ఎన్నో విజయాలను రాజమౌళి గౌరవించారు. శ్రీదేవిజీపై నాకు చాలా గౌరవం ఉంది. ఆమెకు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను.” అంటూ రాజమౌళి గతంలో అన్నారు. అయితే బాహుబలి సినిమాలో శ్రీదేవి ఉంటే ఎలా ఉండేదో అని ప్రతిఒక్కరూ ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.

Also Read: Nayanthara: నయన్ సంచలన నిర్ణయం.. జవాన్ తర్వాత సినిమాలకు గుడ్ బై?