Site icon HashtagU Telugu

Sri Vishnu : శ్రీ విష్ణు ఓం భీం బుష్.. మరో జాతిరత్నాలు అవుతుందా..?

Sri Vishnu Om Bheem Bush Fist Loo Poster Released

Sri Vishnu Om Bheem Bush Fist Loo Poster Released

Sri Vishnu లాస్ట్ ఇయర్ సామజవరగమన సినిమాతో ఆడియన్స్ కు ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ అందించి సూపర్ హిట్ అందుకున్న శ్రీ విష్ణు లేటెస్ట్ గా ఓం భీం బుష్ అంటూ మరో ఎంటర్టైనింగ్ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాను హుషారు ఫేం శ్రీ హర్ష డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీ విష్ణుతో పాటుగా ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ సినిమాలో ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఓం భీం బుష్ అంటూ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో వచ్చారు మేకర్స్.

ఈ పోస్టర్ లో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముగ్గురు ఆస్ట్రోనాట్ గెటప్ లో ఉన్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే మంచి బజ్ తెచ్చుకున్నారు. ఈ సినిమాలో ప్రీతి ముకుంధన్, అయేషా ఖాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

V సెల్యులాయిడ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సన్నీ ఎం.ఆర్ మ్యూజిక్ అందిస్తున్నారు. పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెంచిన ఓం భీం బుష్ మరో సామజవరగమన అవుతుందేమో చూడాలి. ఈ సినిమాను మార్చ్ 22న రిలీజ్ లాక్ చేశారు మేకర్స్. ఆడియన్స్ కు తన మార్క్ ఎంటర్టైనింగ్ తో అలరిస్తూ వస్తున్న శ్రీ విష్ణు సామజవరగమన ముందు ఆశించిన ఫలితాలను అందుకోలేదు కానీ లాస్ట్ ఇయర్ వచ్చిన సామజవరగమన తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ హిట్ తో కెరీర్ లో మరింత జోష్ తెచ్చుకున్న శ్రీ విష్ణు మళ్లీ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించాడని ఫిక్స్ అయ్యాడు.