Site icon HashtagU Telugu

Sri Simha-Raga : మురళీమోహన్ మనవరాలితో కీరవాణి కుమారుడి పెళ్లి

Srsimha Raga

Srsimha Raga

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి (Music director is MM Keeravani) చిన్న కుమారుడు శ్రీసింహ (Sri Simha) త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నారు. సీనియర్ నటుడు మురళీమోహన్ మనవరాలు రాగ (Murali Mohan’s granddaughter Raga)ను ఆయన వివాహం చేసుకోబోతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ బ్యాచ్లర్స్ హీరోలు, హీరోయిన్స్ ఇలా ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకొని ఓ ఇంటి వారు అవుతున్నారు. రెండు రోజుల క్రితం టాలీవుడ్ సింగర్లు అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా పెళ్లి (Anurag Kulkarni and Ramya Behra married) చేసుకొని షాక్ ఇచ్చారు. శుక్రవారం నాడు అతి కొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక జరిగింది. అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, కొంత కాలం నుంచి డేటింగ్ కూడా చేశారని, ఇక ఇప్పుడు పెళ్లి పీటలెక్కారని నెటిజన్లు అంటున్నారు. మరి ఇది నిజామా కదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

ఇదిలా ఉండగా ఇప్పుడు మరో వివాహ వార్త బయటకు వచ్చింది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్దమయ్యాడు. ప్రముఖ సినీ నటుడు, వ్యాపారవేత్త, మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్ మనవరాలు రాగ మాగంటిని శ్రీసింహ కోడూరి పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆదివారం రాత్రి హైదరాబాద్లో వీరి ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు ప్రిన్స్ మహేశ్ బాబు (Mahesh Babu), స్టార్ డైరెక్టర్ రాజమౌళి (Rajamouli), నటులు నరేశ్, పవిత్ర, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తదితరులు హాజరయ్యారు.

శ్రీసింహ కోడూరి హీరోగా ఎదుగుతున్న సంగతి తెలిసిందే. కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ సంగీత దర్శకుడిగా, గాయకుడిగా రాణిస్తుండగా.. శ్రీసింహ మాత్రం నటన వైపు అడుగులు వేశారు. చిన్నాన్న ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల్లో బాలనటుడిగా నటించిన శ్రీసింహ.. ‘మత్తు వదలరా’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. మొదటి సినిమాతో ఆకట్టుకున్నారు. ‘తెల్లవారితే గురువారం’, ‘దొంగలున్నారు జాగ్రత్త’, ‘భాగ్ సాలే’, ‘ఉస్తాద్’ సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే, శ్రీసింహ ఇంకా కమర్షియల్ హీరోగా నిలదొక్కుకోలేదు.

రాగ మాగంటి యువ వ్యాపారవేత్త. మురళీ మోహన్‌కు ఇద్దరు సంతానం అన్న విషయం తెలిసిందే. ఆయనకు కుమార్తె మధు బిందు, కుమారుడు రామ్మోహన్ ఉన్నారు. రామ్మోహన్, రూప దంపతుల ఏకైక కుమార్తె రాగ మాగంటి. ఈమె గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలీదు. తన లైఫ్‌ను చాలా ప్రైవేట్‌గా లీడ్ చేస్తున్నారు రాగ. రాగను చాలా సంప్రదాయబద్ధంగా పెంచామని గతంలో ఆమె తల్లి రూప మాగంటి పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB)లో మాస్టర్స్ చదివిన రాగ మాగంటి.. ప్రస్తుతం తాతయ్య నిర్మించిన వ్యాపార సామ్రాజ్యంలో కొన్ని బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్టు సమాచారం. ఇక ఇప్పుడు మురళి మోహన్ – కీరవాణి కుటుంబాలు ఒకటి కాబోతున్నాయి. ఈ రెండు కుటుంబాలకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఇక ఆర్థికంగా చూసుకుంటే మురళీమోహన్‌దే పైచేయి. సినిమాల కన్నా వ్యాపారాల ద్వారానే మురళీమోహన్ బాగా సంపాదించారు. దీనికి తోడు మురళీమోహన్ వ్యాపార సామ్రాజ్యానికి ఏకైక వారసురాలు రాగ. అలాంటి రాగను శ్రీసింహ పెళ్లాడబోతున్నారంటే ఇక ఆయన కెరీర్‌కు తిరుగుండదని అంత మాట్లాడుకుంటున్నారు.

Read Also : Narendra Modi : వారి శక్తి ఖండాలు దాటి మనల్ని బంధించే ఆప్యాయతను ప్రతిబింబిస్తుంది