USTAAD Trailer : ఉస్తాద్ ట్రైలర్ వచ్చేసింది.. బైక్ నుంచి విమానం వరకు ప్రయాణం..

కీరవాణి రెండో తనయుడు శ్రీ సింహ డిఫరెంట్ కథలతో పలు సినిమాలు చేస్తూ వస్తున్నాడు. త్వరలో ఉస్తాద్ అనే సినిమాతో రాబోతున్నాడు.

Published By: HashtagU Telugu Desk
Sri Simha Kavya Kalyanram USTAAD Movie Trailer Released

Sri Simha Kavya Kalyanram USTAAD Movie Trailer Released

మత్తువదలరా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కీరవాణి రెండో తనయుడు శ్రీ సింహ(Sri Simha). ఆ తర్వాత డిఫరెంట్ కథలతో పలు సినిమాలు చేస్తూ వస్తున్నాడు. త్వరలో ఉస్తాద్ అనే సినిమాతో రాబోతున్నాడు. శ్రీ సింహ, కావ్య కళ్యాణ్ రామ్(Kavya Kalyan Ram) జంటగా గౌతమ్ వాసుదేవ్ మీనన్(Gautham Vasudev Menon) ముఖ్య పాత్రలో కొత్త దర్శకుడు ఫణిదీప్ దర్శకత్వంలో వారాహి చాలా చిత్రం నిర్మాణ సంస్థ ఈ సినిమాని భారీగా తెరకెక్కింది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్(USTAAD Trailer) రిలీజ్ చేసాడు చిత్రయూనిట్. ట్రైలర్ చూస్తుంటే.. చిన్నప్పట్నుంచి హీరో సాధారణ మిడిల్ క్లాస్ అబ్బాయిగా పెరిగి ఓ బైక్ మీద ప్రేమ పెంచుకొని, తన ప్రేమ కూడా దూరమయ్యాక పైలెట్ కావాలనుకొని ఎలా పైలెట్ అయ్యాడు అనేది చూపించబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే పైలట్ గా విమానంకు గాలిలో సమస్య వస్తే అందులో ప్రయాణికుల్ని ఎలా కాపాడాడు అన్నది కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది.

ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ఉస్తాద్ సినిమా ఆగస్టు 12న థియేటర్స్ లో రిలీజ్ అవ్వనుంది. ఇక కావ్య కళ్యాణ్ రామ్ మసూద, బలగం సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టింది. ఈ సినిమాతో హ్యాట్రిక్ అందుకోవాలని చూస్తుంది.

 

Also Read : Srikanth : షారుఖ్ ఖాన్ మూవీ రీమేక్.. శ్రీకాంత్ హీరోగా అనౌన్స్ చేసి.. తర్వాత హీరోని మార్చేసి..

  Last Updated: 26 Jul 2023, 08:45 PM IST