Sri Reddy : సినీ పరిశ్రమలో పలువురు మోసం చేసారంటూ రెచ్చిపోయి మాట్లాడి సెన్సేషనల్ అయిన శ్రీ రెడ్డి గత కొన్నేళ్లుగా వైసీపీ(YCP) పార్టీకి భజన చేస్తూ వచ్చింది. జగన్(YS Jagan) గురించి, వైసీపీ పార్టీని పొగుడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వాళ్ళ పార్టీలని ఇష్టమొచ్చినట్టు తిడుతూ వీడియోలు చేసింది. శ్రీరెడ్డి కామెంట్స్ కి రిప్లై ఇవ్వడం కూడా వేస్ట్ అని చాలా మంది ఆమెని పట్టించుకోకుండా వదిలేసారు. అయినా శ్రీరెడ్డి రోజూ బూతులు తిడుతూ వీడియోలు చేస్తూ ఎన్నికల ముందు కూడా హడావిడి చేసింది.
అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే . ఇన్నాళ్లు తాను వైసీపీ పార్టీ అని, జగనన్న కోసం అని చెప్పుకొని తిరిగిన శ్రీరెడ్డిని ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఎవ్వరు పట్టించుకోవట్లేదట. అది కాక ఇటీవల శ్రీరెడ్డి పై ఓ తెలుగుదేశం కార్యకర్త కేసు పెట్టాడు. ఇన్నాళ్లు శ్రీరెడ్డి ఇష్టమొచ్చినట్టు వాగాడంతో ఇప్పుడు టీడీపీ జనసేన కార్యకర్తలు ఆమెని టార్గెట్ చేసారు. దీంతో నాకు చచ్చిపోవాలని ఉంది అంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హడావిడి చేస్తుంది.
శ్రీరెడ్డి తన పోస్ట్ లో.. మెంటల్ గా చాలా డిప్రెషన్ లోకి వెళ్ళాను. ఎప్పుడు నార్మల్ అవుతానో తెలీదు. ఆ భద్రకాళే నన్ను కాపాడాలి. నాకు సూసైడ్ థాట్స్ వస్తున్నాయి. మీడియా, టీడీపీ, జనసేన నన్ను టార్గెట్ చేసారు. నా సొంత పార్టీ వైసీపీ కూడా నన్ను పట్టించుకోవట్లేదు. నేను ఎన్ని రోజులు బతుకుతానో తెలీదు అంటూ పోస్ట్ చేసింది. దీంతో శ్రీరెడ్డి పోస్ట్ వైరల్ అవ్వగా అరెస్ట్ చేస్తారేమో అన్న భయంతో ఇలా డ్రామాలు ఆడుతుందని పలువురు కామెంట్స్ చేస్తుంటే కొంతమంది వైసీపీ వాళ్ళు మాత్రం ధైర్యంగా ఉండండి, మీకు మేమున్నాం అంటూ కామెంట్స్ చేస్తారు. మొత్తానికి ఇన్ని రోజులు ఇష్టమొచ్చినట్టు ఎగిరిన శ్రీరెడ్డి ఇప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతుంది.
Srireddy
Also Read : Rashmika Mandanna : తెలుగు ఇండియన్ ఐడల్ లో రష్మిక.. ఎంతందంగా ఉందంటే..!