The Vijay Devarakonda టాలీవుడ్ హీరో ది విజయ్ దేవరకొండ ఖుషి సినిమాతో జస్ట్ ఓకే అనిపించుకున్నాడు. సినిమా చాలా చోట్ల నష్టాలు వచ్చాయని తెలుస్తున్నా సినిమా వరకు విజయ్ దేవరకొండకు కొంత బూస్టింగ్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా తర్వాత పరశురాం తో ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్నాడు విజయ్. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత గౌతం తిన్ననూరితో సినిమా చేస్తున్నాడు విజయ్. ఆ సినిమా లో హీరోయిన్ గా శ్రీలీలని తీసుకున్నారు. సితార బ్యానర్ లో తెరకెక్కే ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో రాబోతుందని తెలుస్తుంది. కారణాలు ఏంటో తెలియదు కానీ విజయ్ సినిమా నుంచి శ్రీ లీల తప్పుకున్నట్టు తెలుస్తుంది. వరుస సినిమాల వల్ల కావొచ్చు ఈ సినిమాకు అడిగిన డేట్స్ ఇవ్వలేక కావొచ్చేమో కానీ శ్రీ లీల ముందు విజయ్ తో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఓకే అని చెప్పినా తర్వాత మాత్రం కుదరదని అన్నదట.
ప్రస్తుతం యువ హీరోల దగ్గర నుంచి స్టార్స్ వరకు ఆఫర్లు అందుకున్న శ్రీ లీల రాబోయే రోజుల్లో టాలీవుడ్ బిగ్ స్టార్ అవుతుందని ఆశిస్తున్నారు. రాబోతున్న స్కంద నుంచి పొంగల్ సీజన్ లో వచ్చే గుంటూరు కారం వరకు శ్రీ లీల నెలకో సినిమాతో వస్తుంది. ఇంత బిజీగా ఉండటం వల్లే విజయ్ సినిమాకు డేట్స్ ఇవ్వలేకపోతుందని అంటున్నారు.
కానీ అసలు కారణాలు వేరే ఉన్నాయన్న టాక్ కూడా వినిపిస్తుంది. విజయ్ తో సినిమా అంటే అందులో కచ్చితంగా లిప్ లాక్ కంపల్సరీ.. విజయ్ తో నటించిన తర్వాత హీరోయిన్స్ కి ఒక ఇమేజ్ సెట్ అవుతుంది. ఆ రిస్క్ ఎందుకు అనుకుందో ఏమో కానీ విజయ్ (The Vijay Devarakonda) సినిమా ముందు సరే అన్నా సరే తర్వాత తెలివిగా తప్పించుకుంది శ్రీ లీల.
Also Read : Pooja Hegde : ప్రేమలో పూజా హెగ్దే.. త్వరలోనే పెళ్లి..?