టాలీవుడ్ లో ఇప్పుడు సూపర్ ఫాం లో ఉన్న హీరోయిన్ ఎవరంటే అందరు చెప్పే పేరు ఒకటే ఆమె శ్రీ లీల (Sri Leela). రోషన్ హీరోగా వచ్చిన పెళ్లిసందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు రవితేజ ధమాకా సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత రామ్ తో స్కంద (Skanda) చేయగా అది ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. అయితే రీసెంట్ గా వచ్చిన బాలకృష్ణ భగవంత్ (Bhagavanth Kesari) కేసరి సినిమాతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది శ్రీ లీల. ఈ సినిమాలో విజ్జి పాప రోల్ లో అదరగొట్టేసింది అమ్మడు.
ఇక నెక్స్ట్ మంత్ వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) తో ఆదికేశవ్ సినిమాతో రాబోతుంది శ్రీ లీల. శ్రీకాంత్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ (Sitara Entertainments) నిర్మించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శ్రీ లీల కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చింది. సూపర్ ఫాం లో ఉన్న శ్రీ లీల కెరీర్ ప్లానింగ్ లో కూడా అంతే క్లారిటీతో ఉంది. లిప్ లాక్ చేయాల్సి వస్తే ఏ హీరోతో చేస్తారని ప్రశ్న ఆమెని అడిగితే. తాను సినిమాల్లో అసలు లిప్ లాక్ చేయనని అంటుంది.
Also Read : Bigg Boss 7 : కెప్టెన్సీ కోసం గట్టి ఫైట్..!
తనకు డ్యాన్స్ అంటే ఇష్టం కాబట్టి సినిమాల్లో కావాల్సినంత డ్యాన్స్ చేస్తా రొమాంటిక్ సీన్స్ అయితే నో చెప్పేస్తా అంటుంది. అంతేకాదు తన మొదటి కిస్ తన భర్తకి మాత్రమే ఇస్తా అంటుంది శ్రీ లీల. మరి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తున్న శ్రీ లీల నో లిప్ లాక్స్ అనడం ఆశ్చర్యకరంగా ఉన్నా స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఒకవేళ అమ్మడు ఏమైనా మనసు మార్చుకుంటుందేమో చూడాలి.
రామ్ స్కంద పోయినా భగవంత్ కేసరితో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కిన అమ్మడు వైష్ణవ్ తేజ్ తో చేసిన ఆదికేశవ్ తో కూడా హిట్ కొట్టాలని చూతుంది. డిసెంబర్ లో నితిన్ తో చేసిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా కూడా రిలీజ్ అవుతుంది.