SRH Captain Cummins Pushpa Dailogue : SRH అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్.. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ ట్రీట్..!

SRH Captain Cummins Pushpa Dailogue ఐపిఎల్ 2024 లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు దూసుకెళ్తుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 10 పాయింట్స్ తో 3వ స్థానంలో ఉన్న సన్ రైజర్స్ ప్లే ఆఫ్ కోసం

Published By: HashtagU Telugu Desk
Srh Captain Cummins Pushpa Dailogue Tollywood Stars Treat

Srh Captain Cummins Pushpa Dailogue Tollywood Stars Treat

SRH Captain Cummins Pushpa Dailogue ఐపిఎల్ 2024 లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు దూసుకెళ్తుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 10 పాయింట్స్ తో 3వ స్థానంలో ఉన్న సన్ రైజర్స్ ప్లే ఆఫ్ కోసం మరింత పట్టు బిగిస్తుంది. ఇక ఈమధ్య సన్ రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ హోం గ్రౌండ్ సపోర్ట్ కావాలని చెప్పడంతో అప్పటి నుంచి ఆడియన్స్ లో మార్పు వచ్చింది. తెలుగు ఐపిఎల్ టీం అయిన సన్ రైజర్స్ కాకుండా తెలుగు వాళ్లంతా చెన్నై, బెంగుళూరు టీం లను ఫేవరెట్ గా భావిస్తున్నారు.

అయితే కమిన్స్ తమకు హోం గ్రౌండ్ సపోర్ట్ కావాలని చెప్పడంతో కొంతమేరకు పరిస్థితి మారింది. తెలుగు వాళ్లంతా రైజర్స్ కు సపోర్ట్ గా ఉండేందుకు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో సన్ రైజర్స్ టీం తో సూపర్ స్టార్ మహేష్ ఒక ఫోతో షూట్ నిర్వహించారు. మహేష్ లాంగ్ హెయిర్ లుక్ రివీల్ చేస్తూ చేసిన ఈ ఫోటో షూట్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది.

Also Read : Rakul Preet Singh : సమ్మర్ వేడి మరింత పెంచుతున్న అమ్మడు.. పెళ్లైనా తగ్గేదేలే..!

ఇదిలాఉంటే సన్ రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ మన తెలుగు స్టార్ హీరోల డైలాగ్స్ తో అదరగొట్టాడు. ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను, ఎస్.ఆర్.హెచ్ అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైరు అంటూ కమిన్స్ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. వీటితో పాటు పవర్ స్టార్ సిగ్నేచర్, పుష్ప రాజ్ తగ్గేదేలే సింగేచర్ తో రచ్చ చేశాడు.

ప్రస్తుతం కమిన్స్ చేసిన ఈ వీడియో ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇదివరకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా ఇలానే తెలుగు స్టార్స్ డైలాగ్స్ చెప్పిన సంగతి తెలిసిందే.

  Last Updated: 24 Apr 2024, 05:51 PM IST