Site icon HashtagU Telugu

Sreemukhi: బుట్ట బొమ్మలా మెరిసిపోతున్న శ్రీముఖి.. రోజురోజుకీ మరింత అందంగా!

Sreemukhi

Sreemukhi

తెలుగు ప్రేక్షకులకు యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ ఫిమేల్ యాంకర్స్ లో ఒకరిగా రాణిస్తూ, తెలుగులో ఎన్నో షోలకు, ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతోంది. కాగా శ్రీముఖి ముద్దుగుమ్మకు ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే. ఇకపోతే ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కూడా ఈ ముద్దుగుమ్మ పేరే వినిపిస్తోంది. అభిమానులు ఈమెను ప్రేమగా రాములమ్మ అని పిలుస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఏ షోలో చూసిన, ఏ ఈవెంట్ లో చూసిన కూడా శ్రీముఖి పేరే వినిపిస్తోంది.

We’re now on WhatsApp. Click to Join
ముఖ్యంగా శ్రీముఖి చేసే అల్లరి ఆమె ఎనర్జీకి విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పవచ్చు. ఒకవైపు యాంకర్ గా అల్లరిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. కాగా మూడు పదుల వయసు దాటినా కూడా ఈ ముద్దుగుమ్మ ఇంకా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉన్న విషయం తెలిసిందే. శ్రీముఖి ప్రస్తుతం యాంకర్ గానే కాకుండా నటిగా కూడా రాణిస్తోంది. తరచూ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోస్, పద్దతిగా ఉండే ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది రాములమ్మ.

Also Read: Vishwambhara: ఒక్క పోస్టుతో విశ్వంభర మూవీపై అంచనాలు పెంచిన డైరెక్టర్.. పోస్ట్ వైరల్!

ట్రెండ్ కు తగ్గట్టుగా బట్టలు వేసుకుని గ్లామర్ ఫోటోస్ చేయడంతో పాటు అప్పుడప్పుడు పద్ధతిగా లంగా వోని చీరలో నగలు ధరించి మహాలక్ష్మి లా కుందనపు బొమ్మల కనిపిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో ఎల్లో కలర్ లెహంగాను ధరించిన ఈమె ఒంటినిండా నగలు వేసుకుని జడలో పూలు పెట్టుకుని నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. పద్ధతిగా కనిపిస్తూనే తన అందంతో ఆకట్టుకుంటుంది శ్రీముఖి.

Also Read: Allu Arjun: వామ్మో.. అల్లు అర్జున్ కు ఏకంగా అన్ని కోట్ల ఆస్తి ఉందా?