Site icon HashtagU Telugu

Sreeleela Beats Sai Pallavi: సాయిపల్లవిని రీప్లేస్ చేస్తున్న ‘ధమాకా’ బ్యూటీ!

Saipallavi And Sreeleela

Saipallavi And Sreeleela

టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) ప్రస్తుతం లక్కీ గర్ల్స్ గా మారింది. పెళ్లిసందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాల్లోనూ అవకాశాలను దక్కించుకుంటోంది. ఇటీవల మాస్ మహారాజ ధమాకా (Dhamaka) మూవీలో నటించి ఆకట్టుకుంది. నటనకు నటన, అందానికి అందం తోడు కావడంతో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇక డ్యాన్స్ లో మెస్మరైజ్ చేస్తోంది శ్రీలీల. ధమాకా మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తుందనడానికి కారణం ఈ బ్యూటీ గ్లామర్ కూడా. ఈ యంగ్ హీరోయిన్ (Sreeleela) సాయిపల్లవిని రిప్లేస్ చేస్తుందని టాలీవుడ్ ఫ్యాన్స్ అంటున్నారు.

అయితే సాయిపల్లవికి పలు సినిమాలను ఒప్పుకోకపోవడం, ఈ ఏడాది పలు ప్రాజెక్టులను అంగీకరించకపోవడం కూడా ఈ బ్యూటీకి బాగా కలిసివచ్చింది. సాయి పల్లవి కంటే శ్రీలీల (Sreeleela) జూనియర్. ‘ఫిదా’తో 2017లో తెలుగులో సాయి పల్లవి కెరీర్ స్టార్ట్ చేస్తే… గత ఏడాది విడుదలైన ‘పెళ్లి సందD’తో శ్రీలీల కెరీర్ స్టార్ట్ చేశారు. తెలుగులో ఆమె నటించిన సినిమాలు రెండు అంటే రెండు విడుదల అయ్యాయి. ఆ రెండిటితో మంచి డ్యాన్సర్ అని ప్రూవ్ చేసుకున్నారు. ఆ విషయంలో ఇద్దరికీ సేమ్ మార్కులు పడతాయి. కానీ, అవకాశాలు అందుకునే విషయంలో సాయి పల్లవి కంటే శ్రీలీల కొంచెం ముందు ఉన్నారు.

‘ధమాకా’ విడుదలకు ముందు భారీ కమర్షియల్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా రూపొందుతోన్న పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నారు. నితిన్ సినిమా కూడా ఆమె ఖాతాలో ఉంది. మరో మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. శ్రీలీలకు వస్తున్న అవకాశాలు సాయి పల్లవి (Sai Pallavi)కి ఎందుకు రావడం లేదు? అని ఓ ప్రశ్న వేసుకుంటే.. ‘ఫిదా’ బ్యూటీ పెడుతున్న కండిషన్లు అని టాలీవుడ్ టాక్.

Also Read: Tollywood Debutes 2022: టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన హీరో హీరోయిన్స్ వీళ్లే!