రామ్ చరణ్, బుచ్చిబాబు సానా (Ramcharan – Sanabuchhibabu) కలయికలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పెద్ది’ (Peddi). ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం ఈ వారం నుంచి సినిమా బ్రేక్ తీసుకోనుంది. టుస్సాడ్ మ్యూజియం విగ్రహ ఆవిష్కరణ కోసం రామ్ చరణ్ విదేశాలకు వెళ్లనుండగా, రెండు మూడు వారాల పాటు షూటింగ్ కు విరామం ఇవ్వనున్నారు. ఈ గ్యాప్ సమయంలో చిత్రబృందం స్పెషల్ మాస్ సాంగ్ కోసం ఏర్పాట్లు చేస్తోంది. “రంగస్థలం”లో జిగేలు రాణి తరహాలో ఓ ఊర మాస్ ఐటెం సాంగ్‌ను రూపొందించేందుకు దర్శకుడు బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం.
Etela Rajender : తెలంగాణ ఎన్నడూ పేద రాష్ట్రం కాదు.. నాయకులు వెనుకబడేసిన ప్రాంతం: ఈటల
ఇంతకు ముందు ఈ పాట కోసం కాజల్ అగర్వాల్‌ను సంప్రదించారని వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కాజల్‌కి సెట్ కాదని భావించిన బుచ్చిబాబు.. ఫ్రెష్ ఫేస్ కోసం పుష్ప 2లో ‘కిస్ కిస్ కిసిక్’ పాటతో సంచలనం రేపిన శ్రీలీల (Sreeleela) వైపు మొగ్గుచూపారని తాజా సమాచారం. శ్రీలీల డేట్ల సమస్య ఉండటంతో, ఆమెను పూర్తిగా ఫైనల్ చేయలేదన్నప్పటికీ, ప్రాధమికంగా ఆమెను అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె “మాస్ జాతర” చిత్రంతో పాటు బాలీవుడ్‌లో కార్తీక్ ఆర్యన్ సరసన డెబ్యూ మూవీ చేస్తుండటంతో డేట్లు కాస్త కష్టంగా మారింది. కాకపోతే చరణ్ కోసం శ్రీలీల డేట్స్ ను అడ్జెస్ట్ చేస్తా అన్నట్లు చెప్పినట్లు వినికిడి.