Sreeleela First Look: మెగా హీరోతో శ్రీలీల రొమాన్స్.. ఫస్ట్ లుక్ ఇదిగో

ధమాకా ఫేం శ్రీలీల వరుస అవకాశాలతో టాలీవుడ్ లో దూసుకుపోతోంది.

Published By: HashtagU Telugu Desk
Sreeleela

Sreeleela

టాలీవుడ్ కుర్ర హీరోయిన్, ధమాకా ఫేం శ్రీలీల వరుస అవకాశాలతో టాలీవుడ్ లో దూసుకుపోతోంది. రవితేజతో కలిసిన నటించిన ధమాకా మూవీలో అద్భుతమైన డాన్సులు, ఆకట్టుకునే నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రామ్ పోతినేనితో పాటు పలువురు హీరోలతో కలిసి నటించబోతుంది. ఈ నేపథ్యంలో మెగా హీరోతో జోడీ కడుతోంది. పంజా వైష్ణవ్‌తేజ్‌ హీరోగా శ్రీకాంత్‌రెడ్డి దర్శకత్వంలో ‘పీవీటీ04’(వర్కింగ్‌ టైటిల్‌) సినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమాలో శ్రీలీల.. ‘చిత్ర’ అనే పాత్ర పోషిస్తున్నట్లు తెలుపుతూ చిత్రబృందం ఈ ఫొటోను ట్విటర్‌ వేదికగా పంచుకుంది. ఇందులో అల్లరి అమ్మాయిగా, అందరిని ఆకట్టుకునే పాత్రలో నటించబోతోంది. తాను పోషిస్తున్న చిత్ర పాత్ర పట్ల శ్రీలీల ఎంతో ఉత్సాహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా చిత్రీకరించిన ఆమె పాత్రకు సంబంధించిన సన్నివేశాలన్నీ అద్భుతంగా వచ్చాయని మేకర్స్ చెబుతున్నారు. అయితే మెగా హీరో వైష్ణవ్ తేజ్ తన తోటి హీరోయిన్స్ మంచి కెమిస్ట్రీ పండిస్తుంటాడు. ఇక యంగ్ బ్యూటీ శ్రీలీలతో ఏవిధంగా రొమాన్స్ చేస్తాడో వేచి చూడాల్సిందే.

Also Read: Bandi Sanjay: బండికి బిగ్ షాక్.. ప్రచారం చేసినా చోటా బీజేపీ ఘోరపరాజయం!

  Last Updated: 13 May 2023, 03:11 PM IST