Sreeleela With Balakrishna: బాలకృష్ణ చేయి పట్టుకున్న శ్రీలీల.. NBK 108లోకి ఎంట్రీ

పెళ్లి సందD సినిమాతో ఒక్కసారిగా తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ శ్రీలీల..

Published By: HashtagU Telugu Desk
Sreeleela

Sreeleela

వీరసింహారెడ్డితో హిట్ కొట్టిన బాలయ్య అనిల్ రావిపూడితో కొత్త సినిమాను మొదలు పెట్టారు. NBK 108గా వస్తోన్న ఈసినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీలీల ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. అందులో భాగంగా ఆమె షూట్‌లో జాయిన్ అయ్యారని తెలుస్తోంది. దీంతో టీమ్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. హీరోయిన్‌గా కాజల్ నటిస్తోంది.

శ్రీలీల సినీ కెరీర్ విషయానికి వస్తే.. పెళ్లి సందD సినిమాతో ఒక్కసారిగా తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుసగా అవకాశాలను దక్కించుకుంటున్నారు. పెళ్లి సందD సినిమాలో యాక్టింగ్‌తో పాటు తన అందచందాలతో వావ్ అనిపించింది. అయితే శ్రీలీల మాత్రం కేవలం గ్లామర్‌‌‌ను మాత్రమే నమ్ముకోలేదని, నటనతోను ఆకట్టుకోవాలనీ అంటోంది.

ఇప్పటికే ధమాకా హిట్‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్న శ్రీలీల మహేష్ , త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది. అంతేకాదు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో పాల్గోంటోంది. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సినిమాతో పాటు ఇక లేటెస్ట్‌గా పవన్ – సాయి ధరమ్ తేజ్ సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్‌లో నటించనుందని తెలుస్తోంది.

  Last Updated: 10 Mar 2023, 01:18 PM IST